బతికున్న వ్యక్తి చనిపోయినట్లు సృష్టించి..
● ఆదోనిలో అక్రమ రిజిస్ట్రేషన్
ఆదోని అర్బన్: బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు సృష్టించి, ఫోర్జరీ సంతకంతో రూ.కోటిన్నర విలువ చేసే బిల్డింగ్‌ను అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు విఠల్‌రావు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణంలోని కంచగారి వీధిలో తన జేజినాయన హనుమంతరావు ఉండేవారని చెప్పారు. తన తమ్ముడు శ్రీనాథ్ మృతి చెందరాని, అయితే బతికి ఉన్న తన పేరు మీద డెత్ సర్టిఫికెట్‌ను తీసుకున్నారన్నారు. అంతేగాకుండా తన భార్య సునీతభాయి ఆధార్‌కార్డులో వేరే మహిళ ఫొటో వచ్చేటట్లు చేసుకున్నారన్నారు. అక్టోబర్ 22న అదే మహిళతో ఫోర్జరీ సంతకాలు చేయించి అక్రమంగాభవనాన్ని రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. అక్టోబర్ నెలలో 31న బైచిగేరి గ్రామానికి చెందిన నీలాసింగ్‌కు అమ్మేశారన్నారు. ఆ బిల్డింగ్‌లో అద్దెకు ఉన్న వ్యక్తి చూసి సమాచారం అందించడంతో హైదరాబాద్ నుంచి తాను వచ్చానన్నారు. మున్సిపల్, త్రీటౌన్ పోలీస్‌స్టేషన్, రిజిస్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలించకపోవడంతో ఈనెల 3న జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇప్పటికై నా ఆస్తిని కాపాడాలని కోరారు.


