నేడు వీరభద్రస్వామి, కాళికాదేవిల నిశ్చితార్థం
ఆస్పరి: రాష్ట్రంలో పిడకల (నుగ్గులాట) సమరం అంటేనే టక్కన గుర్తుకొచ్చేది ఆస్పరి మండలంలోని కై రుప్పల గ్రామం. ఆ నుగ్గుల సమరానికి కారణమైన (భక్తులు ప్రేమికులుగా భావిస్తున్న) వీరభద్రస్వామి, కాళికాదేవిల పెళ్లికి పెద్దల సమక్షంలో సోమవారం నిశ్చితార్థం జరుగనుంది. అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ గ్రామస్తులు కొనసాగిస్తున్నారు. పెద్దలు అంగీకారం మేరకు ఏటా కార్తీక మాసం ముగిసిన తరువాత మొదటగా వచ్చే సోమవారం స్వామి, అమ్మవార్ల నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అనంతరం దాదాపు నాలుగు ఐదు నెలల తర్వాత ఉగాది పర్వదినం రోజు పిడకల సమరం తరువాత స్వామి అమ్మవార్ల పెళ్లిని ఘనంగా నిర్వహిస్తారు. గ్రామంలో సోమవారం జరిగే కార్యక్రమానికి ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి హాజరు కానున్నన్నారు.


