వెండి కిరీటం విరాళం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం పరిధిలోని బయలు వీరభద్రస్వామివారికి అలంకరింప జేసేందుకు వెండికిరీటం, రెండు వెండి కర్ణాలు, రెండు వెండి నేత్రాలను శ్రీశైలంకు చెందిన ఎం.సుబ్రమణ్యం విరాళంగా సమర్పించారు. ఇవి 1.230 కేజీల బరువు ఉన్నట్లు దాత తెలిపారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాత వీటిని అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు విజయస్వామి, పర్యవేక్షకులు రవి, అమ్మవారి ఆలయ ఇన్‌స్పెక్టర్ కె. మల్లికార్జున, జూనియర్ అసిస్టెంట్ ఎం.సావిత్రికి అందజేశారు. అనంతరం దాతను స్వామి వారి శేషవస్త్రాలతో సత్కరించారు.


