విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్‌

Nov 20 2025 7:38 AM | Updated on Nov 20 2025 7:38 AM

విద్య

విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్‌

ఒకే భవనంలో మూడు కార్యాలయాలు

బేతంచెర్ల: చిన్నారులకు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి పాఠాలు బోధించారు. బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. యంబాయి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. చిన్నారులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించాలని అంగన్‌వాడీ కార్యకర్తలను ఆదేశించారు. బరువు తక్కువ ఉన్న పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం తినేలా చూడాలని, వారికి ఐరన్‌ పోలిక్‌ యాసిడ్‌ మాత్రలను వేయించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గర్భిణులకు అవసరమైన కిట్లను సమయానికి అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రంలోని రిజిష్టర్‌ను పరిశీలించారు. అనంతరం గ్రామంలో రైతులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. చామంతి పూలను, ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన పంటలను చూసి రైతులను అభినందించారు.

రైతు సంక్షేమమే లక్ష్యం

బేతంచెర్ల: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, డోన్‌ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. యంబాయి గ్రామంలో అన్నదాత సుఖీభవ, పీఏం కిసాన్‌ డో విడత జిల్లా స్థాయి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. జిల్లాలోని 2,06,052 మంది రైతులకు మెగా చెక్కును అందజేశారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు రైతులకు అందిస్తున్న తోడ్పాటును వివరించారు. జిల్లా కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ.. రైతులు మిశ్రమ, అంతర పంటల మీద దృష్టి సారించాలన్నారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ నాగేశ్వర యాదవ్‌, వ్యవసాయ శాఖ ఏడీఏ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ నరసింహులు, డోన్‌ ఏడీ సునీత, ఎంపీడీఓ ఫజుల్‌ రహిమాన్‌, ఏఓ విజయకుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

తేమ 14 శాతం ఉన్నా పత్తి కొనుగోళ్లు

కర్నూలు సిటీ: సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు స్లాట్‌ బుకింగ్‌లో ఎదురవుతున్న సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని, పత్తిలో 14 శాతం తేమ ఉన్నప్పటికీ రైతులను వెనక్కు పంపకుండా కొనుగోళ్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి తెలిపారు. బుధవారం కర్నూలు రూరల్‌ మండల పరిధిలోని ఆర్‌.కొంతలపాడు గ్రామంలో ఆమె మాట్లాడారు. అత్యధిక శాతం రైతులు లోకల్‌ విత్తనాలు వాడుతుండడం, ఈ ఏడాది అధికంగా కురిసిన వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు.

కర్నూలు(అర్బన్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆరు డివిజన్‌ కేంద్రాల్లో డివిజినల్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయాలను అన్ని హంగులతో త్వరలో ప్రారంభించనున్నారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఆత్మకూరు, నంద్యాల, డోన్‌ డివిజన్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డీడీఓ కార్యాలయాల్లోనే పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన డివిజనల్‌ పంచాయతీ అధికారి, డ్వామా ఏపీడీ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముగ్గురు డివిజినల్‌ స్థాయి అధికారులకు సంబంధించిన పాలనా వ్యవహారాలన్నీ ఇక నుంచి ఈ కార్యాలయం నుంచే కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ముగ్గురు డివిజినల్‌ స్థాయి అధికారుల కార్యాలయాలకు అనుగుణంగా ఆయా భవనాల్లో సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇందుకు జిల్లా పరిషత్‌ నిధులు రూ.95.70 లక్షలను కేటాయించారు. ఫర్నీచర్‌ ఇతరత్రాలకు అదనంగా మరో రూ.10 లక్షలను వెచ్చిస్తున్నారు. పనులు దాదాపుగా పూర్తయినట్లు జిల్లా పరిషత్‌ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ ప్రతి డీడీఓ కార్యాలయానికి అవసరమైన సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమిస్తామన్నారు. ప్రతి డివిజన్‌కు ప్రత్యేకంగా నియమితులైన డీడీఓ ఆయా డివిజన్లలోని గ్రామ/వార్డు సచివాలయాల పర్యవేక్షణతో పాటు గ్రా మ పంచాయతీల అభివృద్ధి, పన్నుల వసూలు తదితర అంశాలను పర్యవేక్షిస్తారన్నారు.

విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్‌ 1
1/1

విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement