తల్లిదండ్రులకు భరణం హక్కు
● పిల్లల నుంచి నిరాదరణకు గురైన వారు
పొందవచ్చు
● జిల్లా జడ్జి కబర్ధి
నందికొట్కూరు: పిల్లల నుంచి నిరాదరణకు గురైన తల్లిదండ్రులు చట్ట ప్రకారం భరణం పొందే హక్కు ఉందని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ధి, కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి అన్నారు. నందికొట్కూరు సమీపంలోని ఆశ్రమంలో రిటైర్డ్ జిల్లా జడ్జి పి. మోహన్‌రావు ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ధి, కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పిల్లల నుంచి నిరాదరణకు గురైన తల్లిదండ్రులు భరణం పొందవచ్చన్నారు. న్యాయ సహాయం కోసం హెల్ప్‌లైన్ 15100కు ఫోన్ చేయవచ్చన్నారు. సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి, జూనియర్ సివిల్ జడ్జి దివ్య, ఆత్మకూరు ఈఆర్డీఓ నాగజ్యోతి, మున్సిపల్ కమిషనర్ బేబి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


