పరిపాలన చేతకాక దాడులు | - | Sakshi
Sakshi News home page

పరిపాలన చేతకాక దాడులు

Nov 18 2025 5:59 AM | Updated on Nov 18 2025 6:25 AM

హరోం హర!
ఓం నమఃశివాయ.. హరహర మహదేవ..శంభో శంకర నామస్మరణ మార్మోగింది. కార్తీక మాసం కడ సోమవారాన్ని పురస్కరించుకుని శైవాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి దీప దర్శనం చేసుకున్నారు. తర్వాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఇల కై లాసమైన శ్రీశైల మహా క్షేత్రం, మహానంది, యాగంటి భక్తజన సంద్రంగా మారాయి. శ్రీగిరిలో లక్ష దీపోత్సవం, పుష్కరిణికి దశవిధహారతులు కనుల పండువగా జరిగాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆయా క్షేత్రాల్లో స్పర్శదర్శనం రద్దు చేశారు. –సాక్షి, నెట్‌వర్క్‌

భక్తులతో కిక్కిరిసిన పాతాళగంగ

దీపారాధన చేస్తున్న భక్తులు

నంద్యాలలో

ప్రత్యేక అలంకరణలో నాగలింగేశ్వరస్వామి

బొమ్మలసత్రం: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, పరిపాలన చేతకాక టీడీపీ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లా హిందూపురం వైఎఎస్సార్‌సీపీ కార్యాలయా న్ని శనివారం టీడీపీ గూండాలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని నంద్యాలలో వైఎస్సార్‌సీపీ నేతలు సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, ఏసీఈసీ సభ్యులు పీపీ నాగిరెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, గోపవరం సాయినాథ్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాల్‌మిల్‌ అమీర్‌బాషా, సూర్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమశేఖర్‌రెడ్డిల ఆధ్వర్యంలో గాంధీచౌక్‌లోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించా రు. అనంతరం కాటసాని మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మంటగలుపుతున్న టీడీపీ నేతల కళ్లు తెరిపించాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీజీకి వినతిపత్రం అందించామన్నారు. టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినా పోలీసులు చర్యలు తీసుకోకుండా విరుద్ధంగా వైఎస్సార్‌సీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడం హాస్యాస్పదమన్నారు. హిందూపురం వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడటం దివంగతనేత డాక్టర్‌ వైఎస్సార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం, అంబేడ్కర్‌, దేవతామూర్తుల చిత్రపటాలను విసిరేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించటం సరైందికాదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శెట్టి ప్రభాకర్‌, మహిళా విభాగం రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ శశికళారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్‌ అమృతరాజ్‌, మేధావుల సంఘం జిల్లా అధ్యక్షులు రసూల్‌ఆజాద్‌, క్రిష్టియన్‌ మైనారిటీ అధ్యక్షులు కారు రవికుమార్‌, సెక్రటరీలు దేవనగర్‌బాషా, శివనాగిరెడ్డి, మున్సిపల్‌ వింగ్‌ అధ్యక్షులు టైలర్‌ శివయ్య, లీగల్‌సెల్‌ అధ్యక్షులు రామసుబ్బయ్య, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌ విజయశేఖర్‌రెడ్డి, లీగల్‌ సెల్‌ నాయకులు వివేకానందరెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

హిందూపురం వైఎస్సార్‌సీపీ

కార్యాలయంపై దాడి

అమానుషం

పోలీసుల తీరు హాస్యాస్పదం

జిల్లా అధ్యక్షులు కాటసాని

రాంభూపాల్‌రెడ్డి

పరిపాలన చేతకాక దాడులు1
1/4

పరిపాలన చేతకాక దాడులు

పరిపాలన చేతకాక దాడులు2
2/4

పరిపాలన చేతకాక దాడులు

పరిపాలన చేతకాక దాడులు3
3/4

పరిపాలన చేతకాక దాడులు

పరిపాలన చేతకాక దాడులు4
4/4

పరిపాలన చేతకాక దాడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement