అంతర్జాతీయ డాడ్జ్‌బాల్ పోటీలకు ఆదోని క్రీడాకారుడు
ఆదోని సెంట్రల్: అంతర్జాతీయ స్థాయి డాడ్జ్‌బాల్ పోటీలకు ఆదోని క్రీడాకారుడు బి.వెంకట్ ఎంపికయ్యాడు. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు మలేసియాలోని కౌలాలంపూర్‌లో జరగనున్న అంతర్జాతీయ డాడ్జ్‌బాల్ పోటీల్లో భారతదేశం తరఫున బి.వెంకట్ పాల్గొంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ డాడ్జ్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కంబిరెడ్డి, సెక్రటరీ సాబీర్‌అహ్మద్ ఆదివారం తెలిపారు. ఈ క్రీడను ఒక జట్టుగా ఆడతారని, దీనిలో ఆటగాళ్లు తమ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను బంతులతో కొట్టి అవుట్ చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పారు.


