జాతీయ లోక్ అదాలత్ కేసుల పరిష్కారం పెరగాలి
కర్నూలు(సెంట్రల్): డిసెంబర్ 13వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కరించేందు కు చర్యలు తీసుకోవాలని జిల్లాప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షుడు జి.కబర్ధి ఆదేశించారు. బుధవారం జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రితో కలసి జిల్లాలోని వివిధ కోర్టుల్లో పనిచేసే న్యాయమూర్తులతో జాతీయ లోక్ అదాలత్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీకాదిగన కేసులు, ఎకై ్సజ్, మెటార్ యాక్సిడెంట్, చెక్‌బౌన్స్, భూసేకరణ, సివిల్ కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజూ ప్రీలోక్ అదాలత్‌లను పెట్టి త్వరతిగతిన ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. సదస్సులో మొదటి అదనపు జిల్లా జడ్జి కమాదేవి, అరో అదనపు జిల్లా జడ్జి వాసు, ఏడో అదనపు జిల్లా జడ్జి లక్ష్మీరాజ్యం, సీబీఐ కోర్టు జడ్జి శోభారాణి, ఫోక్సోకోర్టు జడ్జి రాజేంద్రబాబు, ఏసీబీ కోర్టు శ్రీవిద్య, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, సీనియర్ సివిల్ జడ్జీలు మల్లేశ్వరి, దివాకర్, జూనియర్ సివిల్ జడ్జీలు సరోజమ్మ, అపర్ణ, అనిల్‌కుమార్, అనూష పాల్గొన్నారు.
మహిళ ఆత్మహత్య
ఆళ్లగడ్డ: పట్టణంలోని ఎస్వీ నగర్‌లో ఓ మహిళ బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. రుద్రవరం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన యోహాను కూతురు సీతమ్మ (31)కు చందలూరు గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తితో వివాహమైంది. ఈ మధ్యకాలంలో సీతమ్మ మానసిక వ్యాధితో ఇబ్బంది పడుతుండటంతో ఎస్వీనగర్‌లో ఉన్న తండ్రికి వద్దకు చేరింది. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు కిందకు దించి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
ఆళ్లగడ్డ: పట్టణ శివారులోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ శివయ్య (50) మృతి చెందాడు. పట్టణంలోని ఎస్వీ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ శివయ్య మంగళవారం రాత్రి పొద్దుపోయాక పట్టణ శివారులోని టిడ్కో గృహాల్లో ప్రయాణికుడిని దించి తిరిగి వచ్చేక్రమంలో జాతీయ రహదారిపైకి వస్తుండగా వెనుకవైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శివయ్యను ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నారుల హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే కేసులు
నంద్యాల(అర్బన్): చిన్నారుల హక్కుల ఉల్లంఘించే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీడబ్ల్యూసీ(చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) చైర్‌పర్సన్ జుబుదాబేగం హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను భిక్షాటన, పనికి పంపకుండా పాఠశాలలకు సంబంధించి విద్యాహక్కును కాపాడాలని పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా బాలల సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఈఆర్‌డీఎస్ సంస్థ సహకారంతో ఆర్టీసీ బస్టాండ్, సంజీవనగర్ గేట్, శ్రీనివాససెంటర్, ఆత్మకూరు బస్టాండ్, తదితర ప్రాంతాల్లో జిల్లా బాలల సంరక్షణ అధికారి స్వప్న ప్రియదర్శిని పలువురు సిబ్బందితో కలిసి బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భిక్షాటన చేస్తున్న ఆరుగురు చిన్నారులను రక్షించి జువైనెల్ జస్టిస్ చట్టం ప్రకారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరిచారు. అనంతరం జుబుదాబేగం మాట్లాడుతూ భిక్షాటన, బాల కార్మికత్వం వంటి చర్యలు చట్టపరంగా నేరమన్నారు. కార్యక్రమంలో అధికారులు శ్రీనివాస్, దర్గయ్య, ఓబులమ్మ, సునిల్, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ లోక్ అదాలత్ కేసుల పరిష్కారం పెరగాలి
జాతీయ లోక్ అదాలత్ కేసుల పరిష్కారం పెరగాలి


