స్నేహితుడే చంపేశాడు
ఆర్‌ఎస్ రంగాపురంలో
బేతంచెర్ల: ఇద్దరి స్నేహితుల మధ్య ఏర్పడిన మనస్పర్థలు చివరకు హత్యకు దారితీశాయి. ఓ వ్యక్తి స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ఆర్‌ఎస్ రంగాపురంలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని ఆర్‌ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన మహబూబ్ బాషా(41) అదే గ్రామానికి చెందిన బోయ మదనభూపాల్ స్నేహితులు. వీరు మూడేళ్ల క్రితం గుజిరిషాపు నిర్వహించే వారు. కాగా మద్యం అక్రమ అమ్మకాల కేసులో మహబూబ్ బాషా జైలుకెళ్లాడు. ఆ సమయంలో తన భార్యకు మదనభూపాల్ మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని మహబూబ్ బాషా అనుమానిస్తూ వచ్చాడు. అలాగే గుజిరీ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల్లో మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న మదన భూపాల్‌తో మంగళవారం రాత్రి కూడా మద్యం మత్తులో మహబూబ్ బాషా గొడవ పడగా, స్థానికులు సర్ది చెప్పారు. ఈ క్రమంలో మధనభూపాల్ బుధవారం తెల్లవారుజామున మహబూబ్ బాషా ఇంటికెళ్లి నిద్రిస్తున్న అతన్ని బళ్లెంతో పొడిచి, రోకలి బండతో తలపై మోది చంపేశాడు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. హతుడి కుమార్తె ఆసియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
వ్యక్తి దారుణ హత్య


