ప్యాపిలి: పట్టణంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లపై ఏడీఎంజీ అధికారులు భారీ జరిమానా విధించారు. ఈనెల 7న ప్యాపిలి పోలీసులు మూడు ఇసుక టిప్పర్లను అదుపులోకి చేసుకుని ఏడీఎంజీ అధికారులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రెండు రోజులుగా సాక్షిలో ‘ఇసుక మస్కా’, ఇసుక సిండికేట్‌లో ఆధిపత్య పోరు’ శీర్షికలతో వరుస కథనాలు ప్రచురితం కావడంతో స్పందించిన ఏడీఎంజీ అధికారులు.. రికార్డులు సక్రమంగా లేకపోవడం, అధిక లోడ్ తదితర కారణాలతో టిప్పర్ల యజమానులకు భారీగా జరిమానా విధించారు. నల్లమేకలపల్లికు చెందిన బాలనరసింహులు టిప్పర్‌కు రూ1.36 లక్ష లు, చిన్న కుల్లాయప్ప టిప్పర్‌కు రూ.1.28 లక్షలు, వెంగలాంపల్లి గ్రామానికి చెందిన బసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి టిప్పర్‌కు రూ.62 వేలు జరిమానా విధించారు. కాగా ఈనెల 10న ప్యాపిలిలో యథేచ్ఛగా ఇసు కను అన్‌లోడ్ చేస్తున్న టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాసేపటికే వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము కూడా టీడీపీలోనే కొనసాగుతున్నా తమపై పెనాల్టీ విధించి మరొక నాయకుడి టిప్పర్‌ను వదిలేయడం ఏమిటని జరిమానాకు గురైన ట్రాక్టర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక టిప్పర్లకు భారీ జరిమానా


