
నాలుగో విడత 508 సెల్‌ఫోన్ల రికవరీ
నంద్యాల: జిల్లాలో నాలుగో విడత మొబైల్ రికవరీలో రూ.83.82 లక్షల విలువ చేసే 508 సెల్‌ఫోన్ల రికవరీ చేసి బాధితులకు అందించామని ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడత 2023 ఏప్రిల్‌లో రూ.1.52 కోట్ల విలువ చేసే 847 సెల్ ఫోన్లు, రెండో విడత 2023 అక్టోబర్‌లో రూ. 86.57 లక్షల విలువ చేసే 510, మూడవ విడత 2024లో రూ.2.43 కోట్ల విలువ చేసే 1,066 సెల్ ఫోన్‌లు, నాలుగో విడతలో రూ.83.82 లక్షల విలువ చేసే 508 సెల్‌ఫోన్‌లు రికవరీ చేశామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు వరూ 5.68 కోట్లు విలువ చేసే 2,934 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గోవా, తెలంగాణా తదితర రాష్ట్రాల నుంచి ఆంద్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం, తూర్పుగోదావరి, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం, నంద్యాల జిల్లాల నుంచి రికవరీ చేశామన్నారు.