
శ్రీశైలం డ్యాం వద్ద ఆక్టోపస్ మాక్‌డ్రిల్
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలం డ్యాం వద్ద ఆక్టోపస్ బృందం మాక్‌డ్రిల్ నిర్వహించింది. ముందుగా డ్యాం పరిసర ప్రాంతాలను, తర్వాత కుడి, ఎడమగట్టు ప్రధాన ద్వారాలు, గ్యాలరీ, క్రస్ట్‌గేట్ల బ్రిడ్జి తదితర ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం డ్యాం వ్యూ పాయింట్ వద్ద ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీరామచంద్రమూర్తి, డ్యాం ఈఈ వేణుగోపాల్‌రెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్పీఎఫ్ ఆర్‌ఐ రాజేష్, హెల్త్ విభాగం, ఫైర్ విభాగాల అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో శ్రీశైలం డ్యాం గురించిన విషయాలను తెలుసుకున్నారు. అనంతరం రాత్రి ఆక్టోపస్ బృందం డ్యాం, వ్యూ పాయింట్, డ్యాం పరిసర ప్రాంతాల వద్ద ఉగ్రవాదులు అనుకోని విధంగా దాడులకు ప్రయత్నిస్తే ఏవిధంగా దాడులను తిప్పికొట్టాలనే విషయాలపై మాక్‌డ్రిల్ నిర్వహించింది.

శ్రీశైలం డ్యాం వద్ద ఆక్టోపస్ మాక్‌డ్రిల్