
నంద్యాల: ఆర్జియమ్ ఇంజనీరింగ్ కళాశాలలో సెకండియర్ చదువుతున్న భాను ప్రకాష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజ్ హాస్టల్‌లో భాను ప్రకాష్ ఉరివేసుకుని బలనన్మరణానికి పాల్పడ్డాడు. మధ్యాహ్నం వరకూ కళాశాలలోనే ఉన్న విద్యార్థి భాను ప్రకాష్.. హాస్టల్‌కు వెళ్లిన తర్వాత ఉరివేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
విద్యార్థి భాను ప్రకాష్ ఉరివేసుకున్న తర్వాత కొన ఊపిరితో ఉండటం చూసి కాలేజ్ యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి భాను ప్రకాష్ మరణించాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉండగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.