
వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
శ్రీశైలంటెంపుల్: ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా శ్రీశైల దేవస్థానం శ్రావణ ఐదో శుక్రవారాన్ని పురస్కరించుకుని వైభవంగా ఉచిత సామూహిక వరలక్ష్మీవ్రతాలను నిర్వహించింది. ఆలయ ఉత్తరద్వారం ఎదురుగా ఉన్న చంద్రవతి కల్యాణ మండపంలో నిర్వహించిన వ్రతాలకు చెంచు ముత్తైదువులను ప్రత్యేకంగా ఆహ్వనించారు. శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలలోని దాదాపు 90గూడేలకు చెందిన సుమారు 650మంది చెంచు ముత్తైదువులు, 950 మందికి పైగా ఇతర భక్తులు వ్రతాన్ని నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాస రావు, శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె.వెంకట శివప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. దేవస్థాన డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్.రమణమ్మ, ఆలయ సహా య కార్యనిర్వహణాధికారి హరిదాసు పర్యవేక్షించారు. వత్రంలో పాల్గొన్న భక్తులకు వస్త్రం, పూలు, గాజులు, కై లాస కంకణాలు, వృక్షప్రసాదంగా తులసి, ఉసిరి మొక్కలు, శ్రీశైలప్రభ మాసపత్రిక అందజేశారు.
ఉరుకుంద హుండీ ఆదాయం రూ.1.08 కోట్లు
కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రంలో చివరి సోమ, గురువారం హుండీలో భక్తులు సమర్పించిన కానుకలకు శుక్రవారం లెక్కించారు. నగదు రూపంలో రూ.1,08,04,708 వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. వెండి 22.500 కేజీలు, బంగారం 1.950 గ్రాములు వచ్చినట్లు చెప్పారు.
మద్యం మత్తులో అర్చకుల గొడవ
మహానంది: మద్యం మత్తులో మహానంది దేవస్థానానికి చెందిన ఇద్దరు అర్చకులు గొడవకు పాల్పడిన సంఘటన సోషల్ మీడియాలో రావడంతో చర్చనీయాంశమైంది. సుమారు నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహానంది దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అర్చకుల మధ్య గొడవ చోటు చేసుకోగా ఓ అర్చకుడు మరో అర్చకుడిని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది.

వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు