
రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
నీటి కుంటలో మునిగి చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వా లని ఎమ్మెల్యే విరూపాక్షి ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులు మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విరూపాక్షి బుధవారం రాత్రి చిగిళి గ్రామానికి వెళ్లి విద్యార్థుల మృతదేహాలకు నివాళులర్పించా రు. విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒకే గ్రామానికి చెందిన, ఒకే తరగతికి చెందిన ఆరుగురు విద్యార్థులు ఒకే చోటకు చేరి మృతిచెందడం తనను కలచివేసిందన్నారు. ఇలాంటి సంఘటనలు ము న్ముందు జరగరాదన్నారు. బాధిత కుంటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఒక్కో విద్యార్థి కుంటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు.