
సాగు భూముల్లో సోలార్ పనులు ఎలా చేస్తారు
నందికొట్కూరు: సాగు భూముల్లో సోలార్ పనులు అడ్డుకోవాలని రైతులు ఆందోళనకు దిగారు. గురువారం మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామ పొలిమేరలో జరుగుతున్న సోలార్ పనులపై రైతుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ శ్రీనివాసులు పరిశీలించారు. తమ పంట పొలాలను కాపాడాలని తహసీల్దార్ కాళ్లపై పడి రైతన్నలు వేడుకున్నారు. పంట పొలాలకు వెళ్లేందుకు రహదారులు ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు అందజేసినా ఎందుకు స్పందించడం లేదని తహసీల్దార్‌ను రైతులు నాగేశ్వరరావు, జగన్‌మోహన్‌రెడ్డి, రామలింగేశ్వరరెడ్డి, స్వామన్న, శివమూర్తి, మాలిక్‌బాషా ప్రశ్నించారు. సోలార్ గ్రీన్ కో ప్రాజెక్టు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే గ్రామాన్నే వదిలేస్తామన్నారు. సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని రైతులకు తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎస్‌ఐ ఓబులేసు, మండల సర్వేయర్ కృష్ణుడు, తదితరులు ఉన్నారు.