
సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో, ఆదే విధంగా దిగువ ప్రాజెక్ట్‌లకు నీటిని విడుదల చేస్తున్నారు. తెరచి ఉంచిన 10 రేడియల్ క్రస్ట్‌గేట్ల నుంచి 4,20,370 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. బుధవారం నుంచి గురువారం వరకు జూరాల, సుంకేసుల, హంద్రీల నుండి శ్రీశైలంకు 4,68,273 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 4,99,611 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. క్రస్ట్‌గేట్ల ద్వారా 3,97,962 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన అనంతరం 68,831 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదిలారు.