47 నూతన మద్యం బార్లకు నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

47 నూతన మద్యం బార్లకు నోటిఫికేషన్‌

Aug 19 2025 4:34 AM | Updated on Aug 19 2025 4:34 AM

47 నూతన మద్యం బార్లకు నోటిఫికేషన్‌

47 నూతన మద్యం బార్లకు నోటిఫికేషన్‌

26వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ 28న లాటరీ ద్వారా బార్ల కేటాయింపు సెప్టెంబర్‌ 1 నుంచి అందుబాటులోకి కొత్త బార్లు

కర్నూలు: మూడేళ్ల కాల పరిమితితో నూతన మద్యం బార్‌ పాలసీ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 1 నుంచి 2028 ఆగస్టు 31వ తేదీ వరకు నూతన పాలసీ అమలులో ఉంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి 47 నూతన మద్యం బార్లకు కలెక్టర్ల అనుమతితో ఉమ్మడి జిల్లాల ఎకై ్సజ్‌ అధికారులు సుధీర్‌ బాబు, రవికుమార్‌ సోమవారం గజిట్‌ విడుదల చేశారు. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి కొత్త బార్లు అందుబాటులోకి రానున్నాయి.

● ఏ ప్రాంతం, ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినా నూతన మద్యం బార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

● ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా కొనుగోలు చేయవచ్చు. ఎన్ని బార్లకై నా దరఖాస్తు చేసుకోవచ్చు.

● అందిన దరఖాస్తుల్లో ఒక్కొక్క బార్‌ను లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. వీటితో పాటు గౌడ కులాలకు కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలో 2, ఆదోని మున్సిపాలిటీలో 1, నంద్యాల మున్సిపాలిటీలో 1, డోన్‌ మున్సిపాలిటీ పరిధిలో 1 చొప్పున రిజర్వేషన్‌ ప్రాతిపదికన బార్లను కేటాయించనున్నారు.

● ఇందుకోసం గౌడ్‌, ఈడిగ కులాలకు సంబంధించిన వారు రిజర్వేషన్‌ ప్రాతిపదికన కేటాయించిన దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

పొడిగించిన వ్యాపార సమయాలు...

బార్లు ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు (14 గంటలు) అనుమతించబడతాయి. గతంలో 11 గంటల వరకే అనుమతి ఉండేది. అయితే ఒక గంట సమయాన్ని పెంచుతూ మందుబాబులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. లైసెన్స్‌ రుసుం ఆరు సమాన వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. ఇన్‌స్టాల్‌మెంట్‌కు సరిపడ బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలనే నిబంధన విధించారు. బార్లకు కూడా ఏ4 దుకాణాల మాదిరిగానే ఏపీఎస్‌డీసీఎల్‌ నుంచి మద్యం స్టాక్‌ కొనుగోలు చేసుకోవచ్చు. లైసెన్స్‌ పొందినవారు 15 రోజుల లోపు రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పట్టణ, సెమీ అర్బన్‌ ప్రాంతాలు, కార్పొరేషన్‌ పరిధిలో 10 కిలోమీటర్లు నిడివిలో, మున్సిపల్‌ ఏరియాలో మూడు కిలోమీటర్ల దూరం ఉండేలా బార్లు ఏర్పాటు చేసుకోవాలి.

కర్నూలు జిల్లాలో బార్ల ఏర్పాటు ప్రాంతాలు...

కర్నూలు కార్పొరేషన్‌లో 16 జనరల్‌ కేటగిరీ 2 గీత కులాలకు, ఆదోని మున్సిపాలిటీలో 4 జనరల్‌ కేటగిరీ 1 గీత కార్మికులకు కేటాయించారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 2, గూడూరు నగర పంచాయతీలో 1 బార్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది.

జిల్లాలో బార్‌లకు

దరఖాస్తుల ఆహ్వానం

నంద్యాల: జిల్లాలో 19 బార్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ అధికారి రవికుమార్‌ తెలిపారు. సోమవారం ఎకై ్సజ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నంద్యాల 14, ఆళ్లగడ్డ 1, నందికొట్కూరు 1, ఆత్మకూరు 1, డోన్‌ 1, బేతంచెర్ల 1 చొప్పున బార్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు జిల్లాలోని కేటాయించిన బార్‌లకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలతో పాటు ప్రాసెసింగ్‌ ఫీజు రూ.10 వేలు చెల్లించాలన్నారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులు అయినా చేసుకోవచ్చని, లైసెన్స్‌ కలిగి ఉండటంపై ఎటువంటి పరిమితి లేదన్నారు. 50 వేల జనాబా ఉంటే రూ.35 లక్షలు, 55 వేల నుంచి 5లక్షల జనాబా ఉంటే రూ.55 లక్షలు లైసెన్స్‌ ఫీజుగా నిర్ణయించామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్‌లో, నంద్యాల ఎకై ్సజ్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఈనెల 26వతేదీ సాయంత్రం 5గంటల వరకు గడువు ఉందన్నారు. 28వ తేదీ కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో బార్‌లను లాటరీ పద్ధతి ఎంపిక చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement