
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు జిల్లా పరిషత్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.15.51 కోట్లతో 348 పనులను మంజూరు చేసింది. ఇందులో ఇయర్ మార్క్‌డ్ ఫండ్ కింద ఎస్సీ, ఎస్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు కూడా వాటా మేరకు నిధులను కేటాయించి పనులను అప్పగించారు. అయితే ఈ పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. జిల్లా పరిషత్ సాధారణ నిధులు, 10 శాతం కాంట్రిబ్యూషన్/సెక్టోరియల్ యాక్టివిటీస్ కింద చేపట్టిన పనుల్లో కొంత జాప్యం జరిగినా, పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఇయర్ మార్క్‌డ్ ఫండ్ కింద చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను ఈ ఏడాది సెప్టెంబర్ 5లోగా సబ్‌మిట్ చేయాల్సి ఉంది. అలాగే పురోగతిలో ఉన్న పనులను కూడా ఈ నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉంది. లేని పక్షంలో మంజూరు చేసిన పనులు కాస్తా ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉంది.
ఇయర్ మార్క్‌డ్ ఫండ్ కింద
చేపట్టిన పనులు
● షెడ్యూల్డు కులాల సంక్షేమానికి(15 శాతం నిధులు) రూ.2,18,95,000 నిధులతో 52 పనులను మంజూరు చేశారు. ఈ నిధులతో ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైన్స్, కమ్యూనిటీ హాల్స్ మరమ్మతులు తదితరాలను చేపట్టే అవకాశం ఉంది. అయితే ఈ పనుల్లో ఇప్పటి వరకు 8 పనులు మాత్రమే పూర్తయ్యాయి. 44 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా ఆదోని పీఆర్ ఈఈ పరిధిలో 16 పనులు, నంద్యాల ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ పరిధిలో 12 పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
● షెడ్యూల్డు తెగల సంక్షేమానికి(6 శాతం నిధులు) రూ.78 లక్షలతో 17 పనులు మంజూరు చేశారు. ఇప్పటి వరకు 3 పనులు పూర్తి కాగా, 14 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నిధులతో ఎస్టీ కాలనీలు, గిరిజన తండాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పెండింగ్‌లో ఉన్న పనుల్లో అత్యధికంగా కర్నూలు పీఆర్ ఈఈ పరిధిలో 4, ఆదోని పీఆర్ ఈఈ పరిధిలో 4 పనులు ఉన్నాయి.
● మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి అంగన్‌వాడీ కేంద్రాలు, శిశు గృహల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు(15 శాతం నిధులు) రూ.2.94 కోట్లతో 58 పనులను మంజూరు చేశారు. ఇప్పటి వరకు 2 పనులు మాత్రమే పూర్తి కాగా, 56 పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ పనుల్లో అత్యధికంగా నంద్యాల పీఐయూ ఈఈ పరిధిలో 22, కర్నూలు పీఆర్ ఈఈ పరిధిలో 11 పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
నత్తనడకన మిగిలిన గ్రాంట్ల పనులు
● జిల్లా పరిషత్ నిధులతో చేపట్టిన పలు రకాల పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి.
● జెడ్పీ సాధారణ నిధులు(23 శాతం) రూ.5.64 కోట్లతో 119 పనులను మంజూరు చేశారు.
● ఇప్పటి వరకు 78 పనులు మాత్రమే పూర్తి కాగా.. మిగిలినవి పురోగతిలో ఉన్నట్లు ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి.
● గ్రామీణ నీటి సరఫరా విభాగానికి(12 శాతం నిధులు) రూ.1.89 కోట్లతో 51 పనులను మంజూరు చేయశారు.
● కేవలం 14 పనులను మాత్రమే పూర్తి చేశారు.
● వేసవిలో ఈ పనులను పూర్తి చేయాలని జెడ్పీ పాలకవర్గం ఎంత ఒత్తిడి చేసినా, నేటికి పనులు పూర్తి కాకపోవడం గమనార్హం.
● సెక్టోరియల్ యాక్టివిటీస్ కింద (10 శాతం నిధులు) రూ.1.85 కోట్లతో 51 పనులకు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 8 పనులు పూర్తి కాగా, 43 పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
మంత్రాలయంలో జిల్లా న్యాయమూర్తులు
మంత్రాలయం రూరల్/కౌతాళం:ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో రాఘవేంద్రస్వామిని ఆదివారం జిల్లా జడ్జి కబర్ది, ఆదోని రెండవ ఆదనపు జిల్లా జడ్జి సుధ, ఆదోని సబ్ జడ్జి నారాయ ణ దర్శించుకున్నారు. వీరికి ఆల య అధికారులు, ఆలయ సిబ్బంది స్వాగతం పలికి స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజ లు చేయించారు. న్యాయమూర్తులకు పూలమాల, శాలువతో సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకు ముందు మంచాలమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అలాగే ఉరుకుంద ఈరన్నస్వామిని కూడా వారు దర్శించుకున్నారు. శ్రావణమాస ఉత్సవాలపై ఈఓ వాణిని అడిగి జిల్లా న్యాయమూర్తులు తెలుసుకున్నారు. వీరి వెంట ఆలయ ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, పర్యవేక్షకుడు వెంకటేష్, కౌతాళం సీఐ అశోక్‌కుమార్ ఉన్నారు.
నంద్యాల: జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో ఈదురు గాలులు, మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించిందన్నారు. ఈ మేరకు వర్షాల సహాయక చర్యల నిమి త్తం నంద్యాల కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ (నెంబరు 08514–293903) ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కంట్రోల్ రూమ్ 24/7 ప్రకారం పనిచేస్తుందన్నారు. ఏదేని అనుకోని అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలన్నారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. నదులు, వంకలు పరివాహక ప్రాంతాల్లో ప్రజ లను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉన్న చోట ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రమాదకరంగా నీరు ప్రవహించే కల్వర్టుల వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించాలన్నారు. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
సచివాలయమే రక్ష

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం