
జిల్లాలో మోస్తరు వర్షం
నంద్యాల(అర్బన్): జిల్లాలో శనివాం నుంచి ఆదివారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. చాగలమర్రి మండలంలో అత్యధికంగా 34.4 మి.మీ, ఆత్మకూరు మండలంలో అత్యల్పంగా 1.2 మి.మీ వర్ష పాతం నమోదైంది. అదే విధంగా ఆళ్లగడ్డలో 22.2, శిరివెళ్ల, గోస్పాడులో 21.6, డోన్, పాములపాడులలో 18.8, బనగానపల్లెలో 18.6, నంద్యాల అర్బన్ 18.4, నంద్యాల రూరల్ 17.6, వెలుగోడు, జూపాడుబంగ్లాలో 13.8, అవుకు 13.2, సంజామల 11.0, మిడుతూరు, మహా నంది 10.2, కోవెలకుంట్ల, బేతంచెర్ల 9.2, రుద్రవరం 8.8, కొలిమిగుండ్ల 8.4, ఉయ్యాలవాడ 7.6, పగిడ్యాల 6.8, దొర్నిపాడు 6.4, బండిఆత్మకూరు 6.2, గడివేముల 5.8, ప్యాపిలి 4.6, నందికొట్కూరు 4.2, శ్రీశైలం 2.4మి.మీ వర్షం కురిసింది.
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దర ఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దర ఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవడంతో పాటు అర్జీలను కూడా నమోదు చేసుకోవచ్చ న్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. సోమవారం ఉద యం 9.30 గంటలకు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
మూడు గేట్ల నుంచి
నీటి విడుదల
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుతుండడంతో తెరిచిన గేట్లను ఒక్కొక్కటిగా మూసివేస్తున్నారు. ఆదివారం సాయంత్రం నాటికి మూడు రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా నాగార్జున సాగర్‌కు 79,269 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం నుంచి ఆదివారం వరకు జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి శ్రీశైలంకు 1,83,263 క్యూసె క్కుల వరదనీరు వచ్చి చేరింది. దిగువ ప్రాజెక్ట్‌లకు జలాశయం నుంచి 2,25,017 క్యూసె క్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్‌వే ద్వారా 1,23,396 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన అనంతరం 69,862 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదిలారు. బ్యాక్‌వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 29,333 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 2,426 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో 4.80 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కుడిగట్టు కేంద్రంలో 15.251 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.868 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఆదివారం సాయంత్రానికి జలాశయంలో 195.6605 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 881.40 అడుగులకు చేరుకుంది.
ఉప్పొంగిన వేదావతి నది
హాలహర్వి: మండలంలోని గూళ్యం గ్రామం వద్ద వేదావతి నది ఉప్పొంగింది. దీంతో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వేదావతి నదికి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరింది. అతి కష్టంపై నదిలో పుట్టి ప్రయాణం చేస్తూ ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలోని గూళ్యం గ్రామానికి చేరుకుంటున్నారు. నదిపై బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.