
జెడ్పీలో 34 మందికి పదోన్నతులు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ కార్యాలయంతో పాటు జెడ్పీ యాజమాన్య పరిధిలోని వివిధ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న 34 మందికి పదోన్నతులు కల్పించారు. శుక్రవారం స్థానిక జెడ్పీలోని తన చాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో వారికి జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి, జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి ఉత్తర్వులను అందించారు. పదోన్నతులు పొందిన వారిలో సీనియర్ అసిస్టెంట్ నుంచి పరిపాలనాధికారిగా ఒకరు, రికార్డు అసిస్టెంట్ నుంచి జూని యర్ అసిస్టెంట్లుగా ఐదుగురు పదోన్నతులు పొందారు. అలాగే ఆయా కార్యాలయాల్లో ఆఫీసు సబార్డినేట్, స్వీపర్లుగా విధులు నిర్వహిస్తున్న వారి అర్హతలను అనుసరించి రికార్డు అసిస్టెంట్లుగా 21, లైబ్రరీ అసిస్టెంట్‌గా 1, ల్యాబ్ అసిస్టెంట్లుగా 6గురికి పదో న్నతి కల్పించారు. ఈ నేపథ్యంలోనే కారుణ్య నియామకాల కింద ఆరుగురికి జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు కల్పిస్తు వివిధ కార్యాలయాలకు పోస్టింగ్స్ ఇచ్చారు.