
గుంతలు ఉన్నాయ్ జాగ్రత్త!
గుంతల్లేని రహదారులను అందుబాటులోకి తెస్తామని ప్రగల్బాలు పలికిన కూటమి నేతలు కనీసం శిథిల రోడ్ల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ చిత్రాల్లో కనిపించే గుంతలు ఎక్కడివో కాదు. జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలోని ప్రధాన రహదారుల పరిస్థితి ఇది. అడుగడుగున గుంతలు ఉండటంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. నూనెపల్లె, నందమూరినగర్ రోడ్డు, ఎన్‌కేరోడ్డు తదితర ప్రధాన రహదారుల్లో గుంతలు పడ్డాయి. అదే విధంగా ఎన్‌జీఓస్ కాలనీ, ఎస్‌బీఐ కాలనీ, హౌసింగ్‌బోర్డు, హనీఫ్‌నగర్, ఎంఎస్‌నగర్, సలీంనగర్, బైటిపేట తదితర ప్రాంతాల్లో అధిక రహదారులు గుంతల మయంగా మారాయి. నూనెపల్లె కోవెలకుంట్ల జంక్షన్ వద్ద లోతైన గుంతలు పడటంతో భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నందమూరినగర్‌కు వెళ్లే రహదారిలోని కుందూ పాత వంతెనపై ఉన్న గుంతలను తప్పించేందుకు వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రోడ్లు ఈ వర్షాలకు మరింత శిథిలమవుతున్నాయి. అధికారులు యుద్ధ ప్రాతి పదికన రహదారుల అభివృద్ధి చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
– నంద్యాల(అర్బన్)
కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే రహదారిలో భారీ గుంతలు ఆళ్లగడ్డ వైపు వెళ్లే జాతీయ రహదారిపై ఏర్పడిన నీటి మడుగు

గుంతలు ఉన్నాయ్ జాగ్రత్త!

గుంతలు ఉన్నాయ్ జాగ్రత్త!