మిగిలిన స్థానాలకే ఆప్షన్లు | - | Sakshi
Sakshi News home page

మిగిలిన స్థానాలకే ఆప్షన్లు

Aug 20 2025 5:59 AM | Updated on Aug 20 2025 5:59 AM

మిగిల

మిగిలిన స్థానాలకే ఆప్షన్లు

గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి

అర్హతల ఆధారంగా గ్రేడ్‌–4కు మార్పు

కోరుకున్న చోటుకు పోస్టింగ్‌ కోసంవిశ్వప్రయత్నాలు

సిఫారసు లేఖల కోసం నాయకుల చుట్టూ ప్రదక్షిణలు

120 ఖాళీలకు ఇప్పటికే వందకు పైగా లేఖలు

ఎవరి ఆశీస్సులు లేకపోతే సరిహద్దు ప్రాంతాలకు బదిలీ

కూటమి ప్రభుత్వంలో చేయి తడపనిదే ఏ పనీ జరగని పరిస్థితి. సామాన్య ప్రజలే కాదు, అధికారులు సైతం తమ పని కావాలంటే నేతల వద్ద చేతులు కట్టుకోవాల్సిందే. ఇక బదిలీల విషయానికొస్తే సిఫారసు లేఖలు లేనిదే ఉన్నతాధికారులు సంబంధిత ఉద్యోగులనుపరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈ లేఖల కోసం నాయకుల చుట్టూ పనులు వదలుకొని ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. అంతేకాదు.. కొందరైనా లేఖల కోసం పోస్టును బట్టి డబ్బు వసూలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలా అంతోఇంతో ఇచ్చి కోరుకున్న పోస్టులు

దక్కించుకున్న అధికారుల్లో నిజాయితీ ఎంతమాత్రం ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది.

కర్నూలు(అర్బన్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న వారిలో అర్హతలను అనుసరించి గ్రేడ్‌–4 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి కల్పించారు. పదోన్నతి పొందిన వీరు తాము కోరుకున్న ప్రాంతానికి పోస్టింగ్‌ ఇప్పించుకునేందుకు స్థానిక ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నాయకులు ఇచ్చే సిఫారసు లేఖలకే బదిలీలు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. పచ్చ నేతల సిఫారసు లేఖలు ఉంటే కోరుకున్న చోటుకు, లేదంటే జిల్లా సరిహద్దులకు బదిలీ చేస్తున్నట్లు కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. ఎలాంటి రాజకీయ పరిచయాలు లేని వారు, సిఫారసు లేఖలు తెచ్చుకోని వారిని నంద్యాల జిల్లా నల్లమల సరిహద్దు ప్రాంతాలకు, కర్నూలు జిల్లాలోని కర్ణాటక రాష్ట్ర సరిహద్దు గ్రామాలకు పోస్టింగ్స్‌ ఇస్తున్నట్లు పదోన్నతి పొందిన సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో చేపట్టిన పదోన్నతుల పోస్టింగ్స్‌కు రెండు జిల్లాల నుంచి వందల సంఖ్యలో గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 403 మంది గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న 120 గ్రేడ్‌ –4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు 120 మంది గ్రేడ్‌ –5 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించారు. గతంలో వారికి వచ్చిన మార్కులు (ర్యాంకింగ్‌), రోస్టర్‌, రిజర్వేషన్‌ ప్రకారం పదోన్నతులు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, పోస్టింగ్స్‌ విషయంలో ర్యాంకింగ్‌, రిజర్వేషన్‌ ఉన్నా.. పచ్చనేతల సిఫారసు లేని కారణంగా వారు కోరుకున్న ప్రాంతానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు జారీ చేసి న సిఫారసు లేఖల ఆధారంగా ఖాళీలను భర్తీ చేసి, మిగిలిన ఖాళీల్లో ఎక్కడికి వెళ్తారో మీరే నిర్ణయించుకోండని పదోన్నతి పొందిన వారి నుంచి ఆప్షన్స్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. సిఫారసు లేఖలతో కోరుకున్న ప్రాంతానికి పోస్టింగ్స్‌ ఇప్పించుకున్న వారు సంతోషంగా ఉండగా, ఎలాంటి రాజకీయ సిఫారసు లేకపోవడ ంతో సరిహద్దు ప్రాంతాల గ్రామాలకు పోస్టింగ్స్‌ అందుకున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన కార్యక్రమాలకు అసోసియేషన్‌ నేతలను ఆహ్వానించే వారని, ప్రస్తుతం ఆ సంప్రదాయం కొనసాగడం లేదనే అభిప్రాయాన్ని పలువురు నేతలు వ్యక్తం చేస్తున్నారు.

సిఫారసులకే పెద్దపీట

మిగిలిన స్థానాలకే ఆప్షన్లు 
1
1/1

మిగిలిన స్థానాలకే ఆప్షన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement