
రూ. 15 వేల పింఛన్ రూ.6 వేలు చేశారు
●చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మాధవరెడ్డి. పదేళ్ల క్రితం పక్షవాతం బారిన పడి ఇంటికే పరిమితమయ్యాడు. కుటుంబసభ్యుల సహాయం లేకపోతే కూర్చోలేడు.. పడుకోలేడు. ఇతనికి గతంలో రూ.15 వేలు పింఛన్ వచ్చేది. 90 శాతం వికలత్వం ఉన్నట్లు గతంలో డాక్టర్లు సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. ఇటీవల కూటమి ప్రభుత్వం రీ రెఫికేషన్ పేరుతో 70 శాతానికి తగ్గించి ఈ నెల నుంచి రూ.6 వేల పింఛన్ మాత్రమే ఇచ్చారు. దీంతో ఇంట్లో వాళ్లు ఆఫీసు చుట్టూ తిరిగినా తమకేమి తెలియదు అని జవాబు ఇస్తున్నారని కుటుంబ సభ్యులు వాపోయారు.