
పురుగుమందుల పరీక్ష ల్యాబ్‌కు ఎన్‌ఏబీఎస్ గుర్తింపు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలులోని క్రిమి సంహారక మందుల పరీక్షా కేంద్రానికి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబోరేటరీ (ఎన్‌ఏబీఎస్) గుర్తింపు లభించింది. ఈ ల్యాబ్ క్యాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తోంది. కర్నూలు పురుగుమందుల నాణ్యతా ప్రమాణాల నిర్ధారణ ప్రయోగశాల 2010 ప్రాంతంలో వ్యవసాయ శాఖ కర్నూలు ఏడీఏ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే పురుగుమందుల శాంపిల్స్‌ను ఈ ల్యాబ్‌లో పరీక్షిస్తారు. మొదటిసారిగా కర్నూలులోని పురుగుమందుల పరీక్ష కేంద్రానికి ఎన్‌ఏబీఎస్ గుర్తింపు లభించడం పట్ల వ్యవసాయ శాఖ అధికారులు హర్షం ప్రకటించారు. ఇదిలాఉంటే ఈ ప్రయోగశాలకు ప్రభుత్వం ఎలాంటి పోస్టులు మంజూరు చేయలేదు. మామూలుగా అయితే ఈ ల్యాబ్‌కు ఏడీఏ, ఏఓ, ఏఈఓలు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మంజూరు చేయాల్సి ఉంది. ల్యాబ్ అయితే ఏర్పాటైంది తప్ప ఒక్క పోస్టు కూడా మంజూరు చేయని పరిస్థితి. ప్రస్తుతం ఏఓ, ఏడీఏ, ఏఈఓలందరు డిప్యూటేషన్‌పై మాత్రమే పనిచేస్తుండటం గమనార్హం.