ఊరూరా సారా బట్టీలు! | - | Sakshi
Sakshi News home page

ఊరూరా సారా బట్టీలు!

Aug 11 2025 6:17 AM | Updated on Aug 11 2025 6:17 AM

ఊరూరా

ఊరూరా సారా బట్టీలు!

ఆత్మకూరు డివిజన్‌లో ప్రతి నెలా

రూ.10 కోట్లకు పైగా వ్యాపారం!

దాడులు నిర్వహించాలంటే

పోలీసులకు సైతం వణుకే

ఆత్మకూరు: కుటీర పరిశ్రమలా జిల్లాలో ఊరూరా నాటుసారా బట్టీలు వెలిశాయి. రాత్రి, పగలు తేడా లేకుండా విక్రయాలు సాగుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని పల్లెల నుంచి ప్రకాశం, కర్నూలు జిల్లాలకు నాటుసారా వెళ్తోంది. నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించాలంటే పోలీసులకు సైతం వణుకుతున్నారు. ఆత్మకూరు డివిజన్‌లో ప్రతినెలా రూ.10 కోట్లకు పైగా మద్యం వ్యాపారం సాగుతోంది. ప్రతిరోజూ వేకువజామున సారా విక్రయాలు ప్రారంభమై అర్ధరాత్రి వరకు కొనసాగుతోంది. నల్లమల అటవీ ప్రాంతంలోని సిద్ధాపురం గ్రామం నాటుసారా తయారవుతోంది. ఇక్కడ బిందె సారా రూ.1,400 నుంచి రూ.2,000 వరకు అమ్మకాలు సాగుతున్నాయి. ఇక్కడి నుంచి ఆత్మకూరు డివిజన్‌లోని అన్ని గ్రామాలపాటు ప్రకాశం జిల్లాలోని దోర్నాల సమీప గ్రామాల్లోనూ, గిద్దలూరు, మార్కాపురం పరిసర ప్రాంతాలతో పాటు నంద్యాల పట్టణ సమీప గ్రామాలకు కూడా సారా సరఫరా అవుతోంది. ఇక్కడ తయారైన నాటుసారాను మోటార్‌ బైకుల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ బట్టీదారులు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.

నల్లమల అటవీ పరిధిలో 70కి పైగా ...

శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు నల్లమల అటవీ డివిజన్‌ పరిధిలోని సిద్ధాపురం గ్రామంతో పాటు బైర్లూటి, నాగలూటి, ముష్టపల్లి, సిద్ధపల్లి, అమలాపురం తదితర గ్రామాల్లో నాటుసారా బట్టీలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. వెలుగోడు మండలంలోని తండా, శ్రీశైలం మండలంలోని సున్నిపెంట, లంబాడీ కాలనీ, బండిఆత్మకూరు మండలంలోని గ్రామాల్లో బట్టీలు ఉన్నాయి. మహానంది మండలం గాజులపల్లి సమీపంలో నాటుసారా బట్టీలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. నల్లమల అటవీ పరిధిలో 70కి పైగా సారా బట్టీలు ఉన్నాయి.

‘బెల్టు’ హవా

శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు, వెలుగోడు, శ్రీశైలం, బండిఆత్మకూరు, మహానంది మండలాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు ఉన్నాయి. గ్రామ గ్రామాల్లో బెల్టుషాపులు కుప్పలు తెప్పలుగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. వైన్‌ షాపులే నిబంధనల ప్రకారం దేవాలయాలు, మసీదులు, విద్యా సమస్యలు, బస్టాండు ప్రాంగణ సమీపానికి సుదూర ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాంటి నిబంధనలనలను తుంగలోకి తొక్కి ఆత్మకూరు పట్టణంలోని కొత్త బస్టాండు, దేవాలయాలు, పాఠశాలలు సమీపంలో ఏర్పాటు చేశారు. వీటికి తోడుగా బెల్టుషాపులు కూడా కుప్పలు తెప్పలుగా వెలిశాయి. ఒక్క ఆత్మకూరు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో 2 నుంచి 4 బెల్టుషాపులు ఉన్నాయి. ప్రతి బెల్టుషాపులు అధిక ధరలకు చీఫ్‌ లిక్కర్‌ విక్రయిస్తున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదు.

వందకు పైగా కేసులు నమోదు చేశాం

ఆత్మకూరు డివిజన్‌ పరిధిలో నాటుసారాపై ఉక్కుపాదం మోపుతున్నాం. అయినప్పటికీ నాటుసారా బట్టీలు కొనసాగుతున్నాయి. దాడులు చేస్తున్నాం. ఇప్పటికే వందకు పైగా నాటుసారా విక్రేతలపై కేసులు నమోదు చేశాం. గ్రామాల్లో విచ్చలవిడిగా ఉన్న బెల్టుషాపులను అదుపులోకి తెస్తున్నాం. నాటుసారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటున్నాం.

– మహేశ్వర్‌రెడ్డి, ఎకై ్సజ్‌ సీఐ, ఆత్మకూరు

పుట్టగొడుగుల్లా..

ఆత్మకూరు డివిజన్‌ పరిధిలోని సిద్ధాపురం, బైర్లూటీ, నాగలూటి చెంచుగూడేల్లో నాటుసారా బట్టీలు ఎకై ్సజ్‌ పోలీసులకు, స్థానిక పోలీసులకు సవాల్‌గా మారాయి. ప్రతినెలా జిల్లా ఎకై ్సజ్‌ పోలీసులు, స్థానిక పోలీసులు దాడులు చేసి సారా బట్టీలను బంద్‌ చేయించినప్పటికీ యథాతథంగా గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ ప్రాంతాలకు చెందిన వాసులకు ఓ కుటీర పరిశ్రమలా మారింది. ఈ గ్రామాలకు పోలీసులు భారీ బందోబస్తుతో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

ఊరూరా సారా బట్టీలు!1
1/1

ఊరూరా సారా బట్టీలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement