
దొంగ హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
కర్నూలు(సెంట్రల్): దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గద్దెనెక్కారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పి.రామచంద్రయ్య ఆరోపించారు. సీపీఐ 24వ జిల్లా మహాసభలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాజ్‌విహార్ నుంచి పాతబస్టాండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అనంతరం ఏపీ టూరిజం పున్నమి సమావేశ భవనంలో జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య అధ్యక్షతన ప్రతినిధుల సభను నిర్వహించారు. కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.20 వేల కోట్లను కేటాయించాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తోపాటు సహా య కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రామచంద్రయ్య పాల్గొన్నారు.