వేణుగోపాలా.. ఆపద్బాంధవా!
ఆళ్లగడ్డ: నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఎగువ అహోబిలం క్షేత్రంలో జ్వాలా నరసింహస్వామి వేణుగోపాల స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామున నిత్య పూజల్లో భాగంగా సుప్రభాత సేవతో స్వామిని మేల్కొపిన అనంతరం అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జ్వాలా నరసింహుడిని వేణుగోపాల స్వామి అలంకారంలో, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను రుక్మిణీ, సత్యభామలుగా అలంకరించి కొలువుంచి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆతర్వాత ఉభయ దేవేరులతో ఉత్సవ పల్లకీని అధిరోహించిన స్వామివారు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. రాత్రి ఉభయ దేవేరులతో స్వామి వారు పొన్నచెట్టు వాహనంపై కొలువై భక్తులను అనుగ్రహించారు. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో ఎగువ, దిగువ అహోబిల క్షేత్రాలు కళకళలాడాయి.
వైభవంగా కొనసాగుతున్న
నారసింహుడి జయంతి బ్రహ్మోత్సవాలు
శ్రీ వేణుగోపాల స్వామి అలంకరణలో
జ్వాలా నరసింహుడు
వైభవంగా పొన్నచెట్టు వాహన సేవ
వేణుగోపాలా.. ఆపద్బాంధవా!


