హాజరు ఇలా.. భోజనం ఎలా?
ప్రతి రోజు విధిగా ఉదయం 9 గంటలకు తిరిగి సాయంత్రం 4 గంటలకు ఫేస్‌యాప్ వేయాలి. అలాగే వచ్చిన వెంటనే పిల్లల హాజరు ఫొటో తీయాలి. ఎంత మంది హాజరైతే అంతమంది చిన్నారులకు మాత్రమే ఆహారం అందించాల్సి ఉంది. మూడు సంవత్సరాల్లోపు చిన్నారులు కావడంతో జిల్లాలోని చాలా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉదయం 10.30 గంటల వరకు పిల్లలు వస్తూనే ఉంటారు. ముందుగానే యాప్‌లో నమోదు చేసిన కారణంగా తర్వాత వచ్చిన పిల్లలకు ఆహారం అందించేందుకు అవకాశం లేకపోవడంతో వండిన ఆహారాన్నే అందరికి సర్దిపెట్టాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమస్యను అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని అంగన్‌వాడీలు వాపోతున్నారు.


