శ్రీశైలం టెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐఅండ్‌పీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. బుధవారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన మంత్రి పొంగులేటి దంపతులకు ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన కార్యనిర్వహనాధికారి ఎం.శ్రీనివాసరావు, అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి పొంగులేటి దంపతులు మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న వివిధ పథకాలకు మంత్రి దంపతులు రూ.10,11,116 విరాళాన్ని ఈఓకు అందజేశారు. స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందించి దేవస్థానం మంత్రి దంపతులను సత్కరించారు.
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
మద్దికెర: మద్దికెర – మల్లప్పగేట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి గుర్తు తెలియని రైలు నుంచి జారి పడి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. గుంతకల్లు రైల్వే ఎస్‌ఐ మహేంద్ర తెలిపిన వివరాలు.. దాదాపు 35 ఏళ్ల వయస్సున్న వ్యక్తి రైలు నుంచి జారిపడి తలకు బలమైన తీవ్రగాయం కావడంతో మృతి చెందాడని ఎస్‌ఐ తెలిపారు. ఘటనా స్థలలో ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఎవరైనా మృతుడిని గుర్తుపడితే 9866144616కు సమాచారం అందించాలన్నారు.
కుందూనదిలో పడి ఆర్టీసీ ఉద్యోగి..
కోవెలకుంట్ల: పట్టణంలోని ఎల్‌ఎం కాంపౌండ్‌కు చెందిన ఆర్టీసీ ఉద్యోగి ప్రమాదవశాత్తూ కందూనదిలో పడి మృతి చెందాడు. కోవెలకుంట్ల పోలీసులు అందించిన సమాచారం మేరకు కోవెలకుంట్లకు చెందిన గోగు చెన్నయ్య(52) స్థానిక ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం కాలికి పక్షవాతం సోకింది. అప్పటి నుంచి డిపో గ్యారేజిలో మెకానిక్‌గా ఉద్యోగాన్ని బదలాయించారు. చెన్నయ్యకు సోమవారం సెలవు కావడంతో పట్టణ శివారులోని కుందూనదిలో స్నానం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిలో పడి మునిగిపోయాడు.
రెండు రోజులు అయినా ఇంటికి రాక పోవడంతో డ్యూటీ నిమిత్తం ఎక్కడికై నా వెళ్లాడని కుటుంబ సభ్యలు భావించారు. అయితే బుధవారం ఉదయం కుందూలో శవమై కనిపించాడు. మృతుడి భార్య సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు హెడ్‌కానిస్టేబుల్ నాగూర్‌వలి తెలిపారు.
శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న తెలంగాణ మంత్రి


