● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలాల నుంచి 203 మంది అర్జీలు వచ్చా యి. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్‌ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించడంతో పాటు ఫిర్యాదుదారుల నుంచి అభిప్రాయా లు సేకరించాలన్నారు.
ఉపాధి పనులు కల్పించండి
ఉపాధి కూలీలకు పనులు కల్పించడంలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేతన దారులకు పను లు కల్పించడంలో ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పట్టణాలలో ఉన్న ప్రధాన కూడళ్ల వద్ద చలువ పందిళ్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.


