శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి పలువు రు భక్తులు భారీగా విరాళాలు సమర్పించారు. శనివారం రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెంది న కనకదుర్గ అన్నప్రసాద వితరణకు రూ.2,00,232 విరాళాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి స్వాములకు అందజేశారు. అలాగే నెల్లూరుకు చెందిన బి.పల్లవి ప్రాణధాన ట్రస్ట్ కు రూ.1,00,011, గో సంరక్షణనిధి పథకానికి బి.మౌనిక రూ.1,00,011, అన్నప్రసాద వితరణకు యామిని సురేష్ రెడ్డి రూ.1,00,011, బసిరెడ్డి శ్రీనివాసరెడ్డి రూ.1,00,011, గో సంరక్షణ నిధి పథకానికి బసిరెడ్డి సాయిచరణ్ రూ.1,00,011 విరాళాన్ని అందజేశారు. ఆయా విరాళాలను క్యూలైన్ల సహాయ కార్యనిర్వహణాధికారి స్వాములుకు అందజేశారు. విరాళాలు అందించిన దాతలకు దేవస్థానం తరుఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాల ను, జ్ఞాపికలను అందించి సత్కరించారు.
కస్తూర్బాలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల (న్యూటౌన్): జిల్లాలోని 27 కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవతస్రం ప్రవేశాలకు దరఖాసులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త నాగసువర్చల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికి ఆన్‌లైన్ ద్వారా ఈనెల 22 నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆమె తెలిపారు. అలాగే 7, 8, 9, 10, సెకండ్ ఇంటర్ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. https://apkgbv. apcfss.in వెబ్‌సైట్ ద్వారా వచ్చిన దరఖా స్తులను మాత్రమే ప్రవేశాల నిమిత్తం పరిగణలోకి తీసుకుంటామన్నారు. మరింత సమాచారం కోసం నంద్యాల వైఎస్సార్‌నగర్‌లో ఉన్న కేజీబీవీ ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలన్నారు.
‘పది’ తెలుగు –2 పరీక్షకు 99.77 శాతం హాజరు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో శనివారం జరిగిన తెలుగు పేపర్–2 పరీక్షకు 99.77 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో 66 పరీక్ష కేంద్రాల్లో 3,552 మంది విద్యార్థులకు గాను 3,544 మంది హాజరు కాగా 8 మంది విద్యార్థులు మాత్రమే గైర్హాజరయ్యారు. జిల్లాలో ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు 17 పరీక్ష కేంద్రాలను, ఆరు పరీక్ష కేంద్రాలను డీఈఓ జనార్దన్‌రెడ్డి తనిఖీ చేశారు. సమస్యాత్మక కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి పరీక్షలు సజా వుగా నిర్వహిస్తున్నట్లు డీఈఓ తెలిపారు. ఎవరై నా మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తప్ప వని హెచ్చరించారు.
గస్తీ పోలీసులకు రేడియం జాకెట్ల పంపిణీ
బొమ్మలసత్రం: జిల్లాలో రాత్రివేళ గస్తీ నిర్వహించే పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ అదిరాజ్‌సింగ్‌రాణా శనివారం రేడియం జాకెట్లను పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ బ్లూకోట్ సిబ్బంది నిరంతరం ప్రజల కోసం రహదారులపై విధులు నిర్వహిస్తుంటారన్నారు. వాహనాల ద్వారా ఎలాంటి ముప్పు వాటిళ్లకుండా ఉండేందుకు ఇవి రక్షణ కల్పిస్తాయని వివరించారు. క్యూఆర్‌టీ సిబ్బందికి గ్రీన్‌కోట్స్, క్లూస్‌టీమ్‌కు ఎల్లో కోట్‌లను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జావళి ఆల్ఫోన్స్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్‌బాబు పాల్గొన్నారు.
శ్రీశైల దేవస్థానానికి భారీగా విరాళాలు


