పెన్షన్‌.. టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

పెన్షన్‌.. టెన్షన్‌

Nov 19 2026 3:25 AM | Updated on Nov 19 2026 3:25 AM

జాబితాలో పేరుంటే చాలు..

సాక్షి ప్రతినిధి నల్లగొండ : కొత్తగా పింఛన్‌ మంజూరైందన్న ఆనందం లబ్ధిదారుల్లో ఎంతోసేపు నిలవడం లేదు. మంజూరు జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ చేతికి పత్రాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమకు పింఛన్‌ మంజూరైందా.. లేదా.. అన్న సందేహంతో మున్సిపల్‌, సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెల 19 నుంచి నగదు పంపిణీ ప్రారంభం కానుండటంతో తమ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయా లేదా అని ఆరా తీస్తున్నారు.

కొత్తగా 28,594 మందికి పింఛన్లు మంజూరు

ప్రభుత్వం ఇటీవల జిల్లావ్యాప్తంగా కొత్తగా 28,594 మందికి పింఛన్లు మంజూరు చేసింది. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులతోపాటు గీత, చేనేత తదితర వృత్తులపై ఆధారపడిన వారికి పింఛన్లు కేటాయించింది. నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల ద్వారా పలువురు లబ్ధిదారులకు ఇప్పటికే మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ నెల 19 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్‌ సొమ్ము జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొత్తగా పింఛన్‌ మంజూరైన వారంతా ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తున్నారు.

నల్లగొండ మున్సిపాలిటీలో 1,750 మందికే..

నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా 1,903 పింఛన్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు 1,750 మంది లబ్ధిదారులకు మాత్రమే మంజూరు పత్రాలు అందినట్లు సమాచారం. మిగిలిన వారికి పత్రాలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమ పేర్లు మంజూరు జాబితాలో ఉన్నప్పటికీ పత్రాలు ఎందుకు ఇవ్వడం లేదని అధికారులను అడుగుతున్నారు.

మంజూరు పత్రాలు అందని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. సాంకేతిక సమస్య కారణంగానే కొందరికి మంజూరు పత్రాల జారీ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని వివరిస్తున్నారు. జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరికీ పింఛన్‌ అందుతుందని భరోసా ఇస్తున్నారు.

ఫ జాబితాలో పేరున్నా.. చేతికందని లెటర్‌

ఫ పింఛన్‌ మొత్తం వస్తుందా.. రాదా అని ఆందోళన

ఫ కార్యాలయాల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు

ఫ సాంకేతిక సమస్యతోనే జాప్యం అంటున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement