ఒత్తిడిని జయించేందుకు ‘టెలీ మానస్‌’ | - | Sakshi
Sakshi News home page

ఒత్తిడిని జయించేందుకు ‘టెలీ మానస్‌’

Nov 19 2026 3:25 AM | Updated on Nov 19 2026 3:25 AM

నల్లగొండ : మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు నిపుణుల సలహాలు పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘టెలీ మానస్‌’ సేవలను అందుబాటులోకి తెచ్చిందని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో అనేకమంది ఒత్తిడి, ఆందోళన, నిరాశతో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారికి నిపుణుల సలహాలు ఉపశమనం కలిగిస్తాయన్నారు. బాధితులు 14416 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి ఉచితంగా మానసిక నిపుణుల సలహాలు పొందవచ్చని, ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌కరణ్‌ రెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాహుల్‌, డీసీహెచ్‌ఎస్‌ భానుప్రకాష్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ జయలత, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయిలోనూ

బహుమతులు సాధించాలి

విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబర్చి బహుమతులు సాధించాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆకాంక్షించారు. బుధవారం నల్లగొండ విద్యా శిక్షణ సంస్థ (డైట్‌)లో ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, క్విజ్‌ పోటీలను ఆయన పరిశీలించి మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. బ్యాలెట్‌ పేపర్‌, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) ద్వారా ఎన్నికలు నిర్వహించే విధానాలను వివరించారు. కార్యక్రమంలో డీఈఓ సుశీందర్‌రావు, డైట్‌ ప్రిన్సిపాల్‌ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

ఫ వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement