నామినేషన్ల చివరి వరకు పట్టభద్రుల ఓటరు నమోదు | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల చివరి వరకు పట్టభద్రుల ఓటరు నమోదు

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

నల్లగొండ : వరంగల్‌– ఖమ్మం –నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఓటరు నమోదు కోసం ఫారం –18 సమర్పించడానికి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల చివరి తేదీ వరకు గడువు ఉందని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో ఓటరుగా నమోదు చేసుకునేవారు అభ్యంతరాలు పరిష్కారం సమయంలో, అలాగే తుది ఓటరు జాబితా సమర్పించిన అనంతరం నామినేషన్ల చివరి తేదీ వరకు కూడా ఓటు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

సర్వే పరికరాలకు

మిల్లర్ల విరాళం

నల్లగొండ : జిల్లా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కార్యాలయానికి అవసరమైన పెంటాక్స్‌ జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్‌ సర్వే పరికరాల కొనుగోలుకు నల్లగొండ జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ రూ.5.71 లక్షల ఆర్థిక సహాయం అందించింది. ఈ మేరకు అసోసియేషన్‌ అధ్యక్షుడు కర్నాటి నారాయణ, జనరల్‌ సెక్రటరీ రేపాల భద్రాద్రి రాములు, నల్లగొండ సెంటర్‌ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీరుమల్ల శ్రీనివాస్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌కు చెక్కు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ వెంకటేశ్‌, మేనేజర్‌ రాంపతి, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ మేనేజర్‌ చిత్తనూరి పవన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

11న జిల్లాస్థాయి యువజనోత్సవాలు

నల్లగొండ టూటౌన్‌ : నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్‌ ప్రభుత్వ కళాశాలలో ఈనెల 11న జిల్లాస్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎండీ.అక్బర్‌అలీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 30వ జాతీయ యువజనోత్సవం 2027కు ప్రతిభ గల వారిని ఎంపిక చేసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జానపద నృత్యం, జానపద పాటలు, చిత్ర లేఖనం, కవితా రచన, నుక్కడ్‌ నాటకం పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల 15 నుంచి 29 ఏళ్లలోపు వారు తమ పేర్లను mybhatat.gov.in/vbyld–2027 పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 8074487020, 9701224412 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

అధ్యాపకులు ఏఐని వినియోగించాలి

నల్లగొండ టూటౌన్‌ : ప్రాజెక్టు రూపకల్పనలో ఏఐని వినియోగించాలని ఎంజీయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ అధ్యాపకులకు సూచించారు. ఆయన శుక్రవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అధ్యాపకుల కోసం నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌డీపీ) ముగింపు సభలో మాట్లాడారు. మెషీన్‌ లెర్నింగ్‌ మోడళ్లు, ఏజెంటిక్‌ ఏఐ వంటి అంశాలను విద్యార్థులకు ప్రత్యేక అధ్యయన రంగాలుగా పరిచయం చేసి, ఆయా విభాగాల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. అధ్యాపకులు తమ రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకునేలా తదుపరి ఎఫ్‌డీపీలను సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ విభాగాలకు విడివిడిగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో విభాగ అధిపతి జయంతి, ప్రిన్సిపాల్‌ హరీష్‌కుమార్‌, రేఖ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్మెంట్‌ డైరెక్టర్‌ ఆకుల రవి, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement