ధాన్యం ధర తగ్గింపుపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం ధర తగ్గింపుపై ఆగ్రహం

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

మిర్యాలగూడ : వరి ధాన్యానికి మిల్లర్లు ఒక్కసారిగా ధర తగ్గించడంతో అన్నదాతలు ఆగ్రహంతో రోడ్కెక్కారు. మిర్యాలగూడలో గత 20 రోజులుగా క్వింటా సన్న ధాన్యాన్ని రూ.4వేల నుంచి రూ.4200 వరకు కొనుగోలు చేసిన మిల్లర్లు.. సిండికేట్‌గా మారి రూ.3,700 మాత్రమే చెల్లిస్తామనడంతో రైతులు శుక్రవారం మిర్యాలగూడ మండలం శ్రీనివాస్‌నగర్‌లోని సాగర్‌ రోడ్డుపై ధాన్యం ట్రాక్టర్లను అడ్డంగా నిలిపి ధర్నా నిర్వహించారు. తమ కష్టానికి తగిన ధర ఇవ్వకుండా మిల్లర్లు ఇష్టానుసారంగా ధరలు తగ్గించడమేంటని నిలదీశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడక బోరుబావుల కింద కొద్దోగొప్పో నీటితో, విద్యుత్‌ ఇబ్బందులను తట్టుకుని శ్రమించి పంటను పండించి, కోతలు కోసి ధాన్యాన్ని మిల్లులకు తరలించే సరికి ధర తగ్గించడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నించారు. రైతు కష్టాన్ని గుర్తించకుండా ధరను ఇష్టానుసారంగా నిర్ణయించడం అన్యాయమని మండిపడ్డారు. రైతుల ఆందోళనలతో శ్రీనివాస్‌నగర్‌ వద్ద గల రహదారిపై ఇరువైపులా అధిక సంఖ్యలో ధాన్యం ట్రాక్టర్లు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రాస్తారోకో వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడారు. మిల్లర్లతో చర్చలు జరిపి ధాన్యం నాణ్యతను బట్టి తగిన ధర చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. పంట పండించిన రైతుకు న్యాయమైన ధర దక్కేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, మిల్లర్లు కుమ్మకై ్క కొనుగోలు ధరను తగ్గించకుండా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఫ ధాన్యం ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి రైతుల నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement