ఆర్‌ఓబీ నిర్మించాలని కేంద్ర మంత్రికి వినతి | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఓబీ నిర్మించాలని కేంద్ర మంత్రికి వినతి

Oct 31 2026 8:31 AM | Updated on Oct 31 2026 8:31 AM

చిట్యాల : చిట్యాల–మునుగోడు రోడ్డులో చిట్యాల పట్టణ శివారులోని రైల్వే గేట్‌ నెంబర్‌–26 వద్ద ఆర్‌ఓబీ (రైల్వే ఓవర్‌ బ్రిడ్జి) నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని శుక్రవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ వివరించారు.

ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించొద్దు : ఎస్పీ

హాలియా : న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రజల ఫిర్యాదులను ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయొద్దని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం హాలియా పోలీస్‌స్టేషన్‌కు ఆయన సందర్శించారు. పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు, పురోగతి, పోలీస్‌ సిబ్బంది పనితీరు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కేసులను నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి, నాణ్యమైన ఆధారాలతో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో నిరంతరం గస్తీ నిర్వహించాలన్నారు. అలాగే మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వారి సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఇన్‌చార్జి డీఎస్పీ రవి, సీఐ రాఘవరావు, ఎస్‌ఐ సాయి ప్రశాంత్‌ ఉన్నారు.

తూనికలు, కొలతల చట్టాన్ని పాటించాలి

మిర్యాలగూడ : వినియోగదారులకు నిర్ణీత పరిమాణంలో నాణ్యమైన సరుకులు అందేలా వ్యాపారులు తూనికలు, కొలతల చట్టాన్ని పక్కాగా పాటించాలని తూనికలు, కొలతలు అధికారి శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం జిల్లా లీగల్‌ మెట్రాలజి అసిస్టెంట్‌ కంట్రోలర్‌ పర్యవేక్షణలో పట్టణ పరిధిలోని ఐదు రైస్‌ మిల్లుల్లో, మూడు రిటైల్‌ విక్రయ దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్యాకేజ్డ్‌ కమోడిటిస్‌ నిబంధనలను పాటించకపోవడం, తూకాల్లో వ్యత్యాసాలు ఉండడంతో రైస్‌ మిల్లులపై, రిటైల్‌ దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బియ్యం కొనుగోలు చేసే సమయంలో బస్తాపై ముద్రించిన బరువును సరిచూసుకోవాలన్నారు. తూకంలో ఎలాంటి లోపాలు ఉన్నా, నిబంధనలు ఉల్లంఘించినా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు.

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి

నల్లగొండటౌన్‌ : నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని, రేషన్‌ షాపుల ద్వారా బియ్యంతో పాటు 14 రకాల సరుకులను సబ్సిడీ ధరలకు పంపిణీ చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. శుక్రవారం నల్లగొండలోని సుందరయ్య భవన్‌లో నిర్వహించిన ఐద్వా జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒకవైపు వేతనాలు పెరగకపోవడం, మరోవైపు ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన ఆదాయంలో అధిక భాగం ఆహార అవసరాలకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సమావేశంలో ప్రభావతి, తుమ్మల పద్మ తదితరులు పాల్గొన్నారు.

3న ఎన్జీ కాలేజీలో జాబ్‌మేళా

రామగిరి(నల్లగొండ) : నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నవంబర్‌ 3న నల్లగొంలోని ఎన్జీ కళాశాలలో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు ఎంజీయూ రిజిస్ట్రార్‌ కె.అంజిరెడ్డి తెలిపారు. ఎస్‌కేఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఉద్యోగ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను ఎంజీయూ ప్రధాన క్యాంపస్‌లో శుక్రవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. బహుళ జాతి కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నాయని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ జాబ్‌మేళాకు 10వ తరగతి లేదా ఆపై చదువు ఉత్తీర్ణులైన వారు తెలిపారు. ఉద్యోగ మేళాకు సంబంధించిన వివరాల కోసం 91820 09732, 96400 73743 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యాపకులు కె.ప్రశాంతి, హైమావతి, నిర్వాహకులు పొట్టిపాక నాగరాజు, ఆవుల సంపత్‌ కుమార్‌, అజయ్‌, రమావత్‌ సతీష్‌, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement