జానాపై మల్లన్న విమర్శలు తగవు | - | Sakshi
Sakshi News home page

జానాపై మల్లన్న విమర్శలు తగవు

Oct 31 2026 8:31 AM | Updated on Oct 31 2026 8:31 AM

నల్లగొండ : సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డిపై తీన్మార్‌ మల్లన్న

వ్యక్తిగత విమర్శలు చేయడం తగదరి డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం నల్లగొండలో తీన్మార్‌ మల్లన్నకు బహిరంగ లేఖ విడుదల చేసి మాట్లాడారు. ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న జానారెడ్డి హింసకు తావులేని రాజకీయాలను నడిపారని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం సాయం కోరితే ఆదుకునే స్వభావం జానారెడ్డిదని పేర్కొన్నారు. జిల్లాలో తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు పాలకులను ఒప్పించి పలు అభివృద్ధి పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. ప్రజా జీవితంలో నిరాడంబరంగా ఉంటూ అవినీతి ఆరోపణలు లేని నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాజకీయాల కోసం అసత్య ఆరోపణలు చేయకుండా బీసీల రాజకీయ ఐక్యతకు కృషి చేయాలని సూచించారు. జానారెడ్డికి 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు జిల్లాపల్లి పరమేష్‌, చింత ధనుంజయ్‌, ఎండీ ముంతాజ్‌ అలీ, ఏళ్ల రవీందర్‌రెడ్డి, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్‌, వేముల గోపీనాథ్‌, మట్టపల్లి నాగరాజు, జమ్మూ అశోక్‌, ఆకటి సైదులు, ఎండీ అజీజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌ నేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement