రూ.9 వేల కనీస పెన్షన్‌ ఇవ్వాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

రూ.9 వేల కనీస పెన్షన్‌ ఇవ్వాలని ధర్నా

Oct 31 2026 8:31 AM | Updated on Oct 31 2026 8:31 AM

నల్లగొండ టూ టౌన్‌ : ఈపీఎస్‌ పెన్షనర్లకు కనీస పెన్షన్‌ను రూ.9వేల చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ (టాప్రా) నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రావిడెంట్‌ ఫండ్‌ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ అసోసియేషన్‌ రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ నూకల జగదీశ్‌చంద్ర మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో సుమారు 82లక్షల మందికిపైగా ఈపీఎస్‌ పెన్షర్లు ఉన్నారని, వారిలో 37లక్షల మందికిపైగా వెయ్యి రూపాయలలోపు పెన్షన్లు పొందుతున్నారని, ఈపీఎస్‌ కనీసం రూ.9 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీనికి తోడుగా కరువు భత్యంతో పాటు ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి శ్యాంసుందర్‌, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎండీ.ఖాదర్‌, కుకుడాల గోవర్ధన్‌, చోల్లేటి యోగేంద్రనాధ్‌, పులి కృష్ణమూర్తి, గుండాల భిక్షమయ్య, రాపోలు వెంకటేశం, రాయపరెడ్డి, ప్రభాకర్‌, రచ్చ సూర్యనారాయణ, దేవచిత్తం, యాదగిరిరెడ్డి, శంకరయ్య, లక్ష్మయ్య, పీవి రెడ్డి, అనంతరెడ్డి, లింగయ్య, దేవేందర్‌, పిబి.చారి, జావీద్‌, చంద్రశేఖర్‌, పీఎస్‌ రావు, ఎం.బాల బ్రహ్మచారి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement