నల్లగొండ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి మోస్తరు వర్షం కురిసింది. చిట్యాల, చండూరు, గుర్రంపోడు, నిడమనూరు, నార్కట్పల్లి, మిర్యాలగూడ, నల్లగొండలో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో వర్షం పడింది. ఎల్నినో ప్రభావంతో మొన్నటి వరకు ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం వర్షంతో వాతావరణం కాస్త చల్లబడడంతో ఉపశమనం పొందారు. వర్షం కారణంగా చేతికొచ్చిన పంట చేలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


