నల్లగొండ: వృత్త్యంతర, సామర్థ్యాభివృద్ధి శిక్షణ కోసం జిల్లాకు చెందిన 43 మంది పీఎంశ్రీ పాఠశాలల హెచ్ఎంలు గురువారం నల్లగొండ నుంచి బస్సులో బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. గురువారం నల్లగొండలోని డీఈఓ కార్యాలయం వద్ద కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ రామాచారి ఈ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆంగ్ల భాషా పఠనాభివృద్ధిపై పీఎంశ్రీ ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వం బెంగళూరులో నాలుగు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. శిక్షణ ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తారు. కార్యక్రమంలో ఎఫ్ఏఓ బాలాజీ నాయక్, కోఆర్డినేటర్లు శ్రీనివాస్ గౌడ్, శ్రీనయ్య పాల్గొన్నారు.


