యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం నిత్య పూజలు నిర్వహించారు. ఉదయాన్నే శ్రీస్వామికి సుప్రభాతం చేపట్టి, స్వయంభూ మూర్తులకు నిజాభిషేకం జరిపించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లకు సహస్ర నామార్చన, కుంకుమార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ముఖ మండపంలో బంగారు ఉత్సవమూర్తులకు అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన పూజ నిర్వహించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యా ణం చేపట్టారు. సాయంత్రం వేళ శ్రీస్వామి అమ్మవార్ల వెండి జోడు సేవను ఊరేగించి, రాత్రి పవళింపు సేవ జరిపి ఆలయాన్ని మూసివేశారు.


