కాలుష్య పరిశ్రమల వద్ద నీటి నమూనాల సేకరణ | - | Sakshi
Sakshi News home page

కాలుష్య పరిశ్రమల వద్ద నీటి నమూనాల సేకరణ

Oct 30 2026 2:21 AM | Updated on Oct 30 2026 2:21 AM

చిట్యాల : మండలంలోని పిట్టంపల్లి గ్రామంలోని పలు రసాయన పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంపై అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఆ గ్రామానికి చెందిన కాలుష్య నివారణ–పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు ఇటీవల జిల్లా కలెక్టర్‌ చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాలతో గురువారం జిల్లా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారి వెంకన్న ఆధ్వర్యంలోని పలువురు అధికారులు పిట్టంపల్లి గ్రామ పరిధిలో తనిఖీలు చేపట్టారు. వియాష్‌, శోభన రసాయన పరిశ్రమల సమీపంలోని పొలాల వద్ద గల బోరునీటి నమూనాలను అధికారులు సేకరించారు. ల్యాబ్‌లో పరీక్షల అనంతరం వచ్చే ఫలితాల ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలకు గురుకుల విద్యార్థి ఎంపిక

నిడమనూరు : మహబూబ్‌నగర్‌లో ఈ నెల 31 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి అండర్‌–19 క్రికెట్‌ పోటీలకు నిడమనూరు శివారులోని బీసీ గురుకుల పాఠశాల (తిరుమలగిరి) 10వ తరగతి విద్యార్థి పి.పవన్‌ ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్‌ కే.రాజశేఖర్‌ తెలిపారు. పాఠశాలలో పీఈటీ ఎల్‌.మురహరి అందిస్తున్న శిక్షణతో విద్యార్థులు వాలీబాల్‌, సాఫ్ట్‌బాల్‌ వంటి క్రీడల్లోనూ రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారని ప్రిన్సిపాల్‌ చెప్పారు. క్రీడల వల్ల విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్‌ లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న పవన్‌కు ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయ బృందం క్రికెట్‌ బ్యాట్‌ను బహూకరించి, పోటీల్లో రాణించి పాఠశాలకు మంచి పేరు తేవా లని ఆకాంక్షించారు.

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

నల్లగొండ : నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన గ్రామీణ నిరుద్యోగ యువకులకు ఏసీ, ఫ్రిజ్‌ల రిపేరింగ్‌లో 30రోజుల పాటు ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌సెటీ) డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న వారికి శిక్షణతో పాటు ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అర్హత, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాల కోసం 9701009265 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement