అవసరం లేకున్నా.. ఐడీ కార్డులెందుకో! | - | Sakshi
Sakshi News home page

అవసరం లేకున్నా.. ఐడీ కార్డులెందుకో!

Oct 29 2026 1:30 AM | Updated on Oct 29 2026 1:30 AM

ఆసక్తి ఉన్నవారిని

తీసుకోమని చెప్పాం

నల్లగొండ టూటౌన్‌ : మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వం చెబుతుంటే జిల్లాలో మాత్రం పొదుపు సంఘాల మహిళల నుంచి ఐడీ కార్డులతో పేరుతో వసూళ్ల దందా మొదలు పెట్టడడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రూపాయి కూడా భారం పడకుండా మహిళల పేరుతో ప్రభుత్వం స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తుంటే.. ఇక్కడ మాత్రం పొదుపు మహిళలకు ఐడీ కార్డు ఇస్తామని చెబుతూ ఒక్కో మహిళ నుంచి రూ.60 వసూలు చేస్తున్నారు. పొదుపు సంఘాల మహిళలందరినీ నుంచి రూ.60 వసూలు చేయాలని మెప్మా అధికారులు రిసోర్స్‌పర్సన్స్‌ (ఆర్పీ)పై ఒత్తిడి తెస్తున్నారు. తమ మాటవినని ఆర్పీలను బెదిరిస్తూ, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని ఒక కార్పొరేషన్‌, ఏడు మున్సిపాలిటీల్లో 7,007 సంఘాల్లో మొత్తం 70,070 మంది సభ్యులు ఉన్నారు. వీరందరి నుంచి రూ.60 చొప్పున వసూలు చేస్తే రూ.42,4,200 అవుతుంది. రూ.25 కూడా ఖర్చు కానీ కార్డుకు రూ.60 చొప్పున వసూలు చేసి రూ.42 లక్షలకుపైగా కొట్టేద్దామనే భారీ స్కెచ్‌ వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రైవేట్‌ ఏజెన్సీ వెనుక మర్మమేంటో..

పొదుపు సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన అధికారులే అడ్డదారిలో వెళ్లి ప్రైవేట్‌ ఏజెన్సీకి ఐడీ కార్డుల తయారీ బాధ్యతలు అప్పజెప్పడం వెనుక ఉన్న మర్మమేమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పొదుపు మహిళలకు ఐడీ కార్డు అవసరం ఏంటనే ప్రశ్నలు ఉద్యోగుల నుంచే వస్తున్నాయి. అసలు రాష్ట్ర ప్రభుత్వం గానీ, జిల్లా కలెక్టర్‌ గానీ జిల్లాలో ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలు ఐడీ కార్డులు తీసుకోవాలని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సర్క్యులర్‌ జారీ చేసిన దాఖలాలు లేవు. అయినా ఇద్దరు ముగ్గురు అధికారులు ఓ ప్రైవేట్‌ ఏజెన్సీ నిర్వాహకులతో కుమ్మక్కు ఇదంతా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

నీలగిరిలో ఆఘమేఘాల మీద..

నల్లగొండ నగరంలో ఐడీ కార్డులు తీసుకోవాలంటూ మెప్మా సిబ్బంది ఆర్పీలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. లోన్‌ ఇప్పించేటప్పుడు లేని శ్రద్ధ.. ఐడీ కార్డుల విషయంలో ఆఘమేఘాల మీద ఆర్పీలకు ఫోన్ల చేస్తూ డబ్బులు వసూలు చేయాలని చెబుతున్నారని ఆర్పీలు అంటున్నారు. కానీ మాకు ఐడీ కార్డు అవసరం ఏముందని మహిళలు ప్రశ్నిస్తున్నారని మెప్మా సిబ్బందికి ఆర్పీలు చెప్పడం విశేషం.

పొదుపు మహిళలకు ఐడీ కార్డులు ఇస్తామని ఓ ప్రైవేట్‌ ఏజెన్సీ నిర్వాహకుడు కలెక్టర్‌కు లెటర్‌ పెట్టుకున్నాడు. దాని ప్రకారం ఆసక్తి ఉన్న మహిళలు ఐడీ కార్డులు తీసుకోమని చెప్పాం. బలవంతంగా తీసుకోవాలని ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ ఎవరిరైనా బెదిరించినట్లు ఫిర్యాదులు వస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాస్‌, మెప్మా పీడీ

మెప్మాలో అధికారుల దందా

ఫ పొదుపు సంఘాల మహిళలంతా తీసుకోవాలంటూ ఆదేశాలు

ఫ ఒక్కొక్కరి నుంచి రూ.60 వసూలు

ఫ ఎలాంటి సర్క్యులర్‌ జారీచేయని సర్కారు

ఫ ఓ ప్రైవేట్‌ ఏజెన్సీతో అధికారుల కుమ్మక్కు!

ఫ జిల్లాలో 70,070 మంది సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement