ప్రజలకు మెరుగైన సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు మెరుగైన సేవలందించాలి

Oct 29 2026 1:30 AM | Updated on Oct 29 2026 1:30 AM

ఫ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌

ఫ నల్లగొండ పట్టణంలో పర్యటించిన కమిషన్‌ చైర్మన్‌

నల్లగొండ, నల్లగొండ టౌన్‌ : ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అధికారులంతా ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో సమావేశమై వివిధ అంశాలపై సమీక్షించారు. అనంతరం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ విద్య, వైద్యం, భూములు, సీనియర్‌ సిటిజన్స్‌, పోలీస్‌, రెవెన్యూ తదితర కేసులతోపాటు, సుమోటో కింద కొన్ని కేసులను స్వీకరించి పరిష్కరిస్తోందన్నారు. విద్యకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాల మంజూరు, విద్యాసంస్థలు విద్యార్థులకు ఒరిజినల్‌ ధ్రువపత్రాలు ఇవ్వకపోవడం, రెవెన్యూ, పోలీస్‌ శాఖలకు సంబంధించిన కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌ఆర్‌సీకి వచ్చే కేసుల సంఖ్య తగ్గిందన్నారు. కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ మానవ హక్కుల కమిషన్‌లో ఈ ఏడాది 5 కేసులు మాత్రమే నమోదైతే వాటిలో 4 కేసులు పరిష్కరించామన్నారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ మాట్లాడుతూ విచారణకు వచ్చిన కేసులన్నింటిని నిబంధనల ప్రకారం పరిష్కరిస్తున్నామని తెలిపారు. అంతకుముందు ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహం చేరుకున్న హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ షమీమ్‌ అక్తర్‌కు కలెక్టర్‌, ఎస్పీ పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు.

కేసుల సంఖ్య తగ్గింది

గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లా నుంచి అతి తక్కువ సంఖ్యలో మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదులు వచ్చాయని, కేసుల సంఖ్య బాగా తగ్గిందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ అన్నారు. నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పలు విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి వద్ద మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. గతేడాది 45 నుంచి 50 కేసులు రాగా ఒక్క కేసుకు తప్ప అన్నింటినీ పరిష్కరించామన్నారు. మహిళలకు అత్యవసరమైతే తప్ప సిజేరియన్‌ చేయాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమాల్లో ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి విజయేందర్‌రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కమలాకర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శశికళ, ఏఎస్పీ రమేష్‌, బీసీ సంక్షేమ అధికారి సంజీవులు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాహుల్‌, డాక్టర్‌ నాగేష్‌, నల్లగొండ తహసీల్దార్‌ పరశురాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement