పట్టభద్రుల ఓటు నమోదుకు సహకరించండి | - | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల ఓటు నమోదుకు సహకరించండి

Oct 29 2026 1:30 AM | Updated on Oct 29 2026 1:30 AM

నల్లగొండ: వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు పెంచేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ కోరారు. బుధవారం నల్లగొండ కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా పెండింగ్‌ లో ఉన్న ఫారం 6 ,7,8 దరఖాస్తులను వారంలో పరిష్కరిస్తామని తెలిపారు. పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటుహక్కు పొందేందుకు అర్హులైన పట్టభద్రులు ఫారం–18 ద్వారా నవంబర్‌ 6లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారుడు మూడేళ్ల క్రితం డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని, స్థానికులై ఉండాలని, పట్టభద్రుల సర్టిఫికెట్‌, అవసరమైన ఇతర పత్రాలు సమర్పించాలని తెలిపారు. సమావేశంలో నాయకులు ముంతాజ్‌ అలీ, బక్క పిచ్చయ్య, లింగస్వామి, సైదులు, తేలు అన్నరవి, హాశం, రవిశంకర్‌, ఎన్నికల విభాగం డీటీ సందీప్‌, వంశీ పాల్గొన్నారు.

రక్తహీనత సర్వే చేపట్టాలి

గిరిజన ప్రాంతాల్లో గుర్తించిన 7 గ్రామాల్లో బాలికలతోపాటు మహిళలకు రక్తహీనత సర్వేను 15 రోజుల్లోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా శిశు సంక్షేమ శాఖ కార్యకలాపాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మంజూరైన 41 నూతన అంగన్‌వాడీ కేంద్రాల పనుకు సోమవారంలోగా శంకుస్థాపన చేయాలన్నారు. అంగన్‌వాడ్లీ పిల్లలకు నాణ్యమైన పోషకా హారం అందించాలన్నారు. అధికారులకు పలు సూ చనలు చేశారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌కరణ్‌రెడ్డి,శిశు సంక్షేమ శాఖ అధికారి లావణ్య, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement