పోలీసులపై నమ్మకం పెంచాలి : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

పోలీసులపై నమ్మకం పెంచాలి : ఎస్పీ

Oct 29 2026 1:30 AM | Updated on Oct 29 2026 1:30 AM

మునుగోడు : న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా చూసి, పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంపొందించేలా సిబ్బంది పనిచేయాలని ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం మునుగోడు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ఆయనకు స్టేషన్‌ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన స్టేషన్‌ పరిసరాలతో పాటు రిసెప్షన్‌ కౌంటర్‌, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రా మాల్లో నిరంతరం గస్తీ నిర్వహించాల న్నారు. అలాగే మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వారి సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో చండూరు సీఐ రాము, డీసీఆర్‌బీ సీఐ శ్రీను నాయక్‌, ఎస్‌ఐ శోభన్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

శివన్నగూడెం ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలి

మర్రిగూడ : మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల రైతులకు సాగునీరు అందించాలంటే శివన్నగూడెం ప్రాజెక్టు పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు. బుధవారం బీజేపీ మండల అధ్యక్షుడు పాత్లావత్‌ రాజేందర్‌నాయక్‌ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఆయన శివన్నగూడెం ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పరిశీలించి మాట్లాడారు. సంస్థాన్‌ నారాయణ్‌పూర్‌, చౌటుప్పల్‌ మండలాల రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు రాచకొండ గుట్టల ప్రాంతంలో రిజర్వాయర్‌ నిర్మించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో దోనూరు వీరారెడ్డి, యాస అమరేందర్‌రెడ్డి, దూడల భిక్షంగౌడ్‌, పిట్టల శ్రీనివాస్‌, రాజుయాదవ్‌, యాస అశోక్‌రెడ్డి, వేనేపల్లి శ్రీనివాస్‌రావు, కేసరి రవీందర్‌రెడ్డి, జిల్లాకుల సైదులుయాదవ్‌, రాకొండ ప్రదీప్‌రెడ్డి, చాపల వెంకటేష్‌, అంబాల రమేష్‌, ఆంగోతు భాస్కర్‌నాయక్‌, పెద్దులుగౌడ్‌, నూకల మల్లేష్‌, కుక్కల వెంకటేష్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

జనాభా లెక్కల్లో కోత

విధించడం అన్యాయం

నల్లగొండ టౌన్‌ : మున్నూరు కాపుల జనాభా లెక్కల్లో కోత విధించడం అన్యాయమని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవయ్య పటేల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన మున్నూరుకాపు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 45 లక్షలుగా ఉన్న మున్నూరు కాపుల జనాభాను ప్రస్తుతం 28 లక్షలకు తగ్గించారని ఆరోపించా రు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో కమిటీల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సైదయ్య పటేల్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి వెంకటేశ్వర్లు, సంకూరి వెంకటనారాయణ, రాళ్లపల్లి ప్రసన్నకుమార్‌, వాసంశెట్టి సైదులు, గాజుల శ్రీనివాస్‌, కుప్పగిరి వెంకటేశ్వర్లు, అనంతరాములు, తొట్ల నాగేశ్వరరావు, లింగయ్య నాయుడు, సాలాది గిరి, గోపిశెట్టి అమరయ్య, అంబటి సైదయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement