నకిరేకల్ : ఆలిండియా సివిల్ సర్వీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బుధవారం ప్రారంభమైన రాష్ట్రస్థాయి నృత్య లఘు నాటిక పోటీల్లో జిల్లాకు చెందిన అధికారులు, ఉపాధ్యాయులు అలరించారు. ఈ పోటీల్లో నకిరేకల్ మండలానికి చెందిన ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, ప్రభుత్వ టీచర్లు పాల్గొని కర్తవ్య నిర్వహణ లఘు నాటికను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో నారథుడిగా ఎంపీడీఓ గన్నోజు బ్రహ్మచారి, దేవేంద్రుడిగా కనుకుంట్ల నవీన్‌రెడ్డి(చందంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం), వరుణ దేవుడిగా కె.బాలాజీ(ప్రాథఽమిక పాఠశాల మండలాపురం), అగ్నిదేవుడిగా ఐ.గోవర్ధన్(ప్రాథమిక పాఠశాల నడిగూడెం), యమధర్మరాజుగా యాదగిరి(పంచాయతీ కార్యదర్శి వల్లాభాపురం), చిత్రగుప్తుడిగా కృష్ణ( ఎంపీడీఓ కార్యాలయ టైపిస్ట్), అప్సరగాయనిగా జి.నాగమణి(పంచాయతీ కార్యదర్శి పాలెం), భూదేవిగా సిలివేరు నాగమణి(జెడ్పీహెచ్‌ఎస్ పీఏపల్లి) పాత్రల్లో అలరించారు. ఈ లఘు నాటకానికి రచన, దర్శకత్వం నకిరేకల్ ఎంపీడీఓ గన్నోజు బ్రహ్మచారి వ్యహరించారు. తాము ప్రదర్శించిన నాటక పదర్శన అందరినీ ఆకట్టుకుందని ఎంపీడీఓ తెలిపారు.


