నల్లగొండ టౌన్ : ప్రతిఒక్కరం మత్తుకు దూరంగా ఉందామని అదనపు ఎస్పీ రమేష్, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్‌పర్సన్ డాక్టర్ పులిపాటి హేమలత అన్నారు. బుధవారం రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో నిర్వహించిన నషాముక్త్ ర్యాలీని వారు ప్రారంభించి మాట్లాడారు. అనంతరం క్లాక్ టవర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ తెర ద్వారా రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా వర్చువల్‌గా పాల్గొని యువత చేత మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ దేవులపల్లి శ్రీకాంత్, కార్యదర్శి గుంటి రామకృష్ణ, కోశాధికారి కుంభం జ్యోతిరెడ్డి, సభ్యులు నన్నూరి లతాకుమారి, రాజలింగం, మిర్యాల యాదగిరి, డాక్టర్ పుల్లారావు, ఐబీసీ ఛానల్ ఎండి ఏచూరి శైలజ, రిటైర్డ్ ప్రిన్సిపాల్ లింగయ్య, ఎస్పీఆర్ స్కూల్ చైర్మన్ నన్నూరి రాంరెడ్డి, లైన్స్‌క్లబ్ గవర్నర్ కోడె సతీష్ పాల్గొన్నారు.


