చండూరు : మండలంలోని చొప్పరివారిగూడెంలో జలసిరి కార్యక్రమం కింద గ్రామ సర్పంచ్ జాల వెంకన్న చేపట్టిన పనులు ఆదర్శమని పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ అభినంధించారు. బుధవారం హైదరాబాద్ నుంచి పంచాయతీ రాజ్ మంత్రి సీతక్కతో కలిసి ఏర్పాటు చేసిన వీడియో కాన్పరెన్స్ ద్వారా చండూరు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందితో ఎల్‌నినోపై సమీక్షించారు. రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి, భూగర్భ జలాల తగ్గుదల, వ్యవసాయ, పారిశుద్ధ్య సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో సర్పంచులు, అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బండారు యాదగిరి, సర్పంచులు జాల వెంకన్న, సత్యం, రాజేష్, రాములు, ఎంపీఓ కోటయ్య, పంచాయతీ కార్యదర్శులు, విబిజిరామ్‌జీ అధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.


